ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి గత కొద్ది నెలలుగా మీడియాలోనూ సోషల్ మీడియాలను హార్ట్ టాపిక్‌గా మారారు. సెలబ్రిటీల పర్సనల్ జీవితాలు ఎలా ? ఉంటాయో ముందుగానే అంచనా వేసి చెబుతూ బాగా వార్తల్లో నానుతున్నారు. అలాగే ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలతో బాగా పాపులర్ అవుతున్నారు. సమంత – నాగచైతన్య విడాకుల విషయం ముందే చెప్పిన వేణుస్వామి ఎంత సంచలనం క్రియేట్ చేశారో తెలిసిందే. చివరకు సమంత – చైతు విషయంలో వేణు స్వామి చెప్పిందే నిజం అయింది.
ఆ తర్వాత రాజకీయ, సినిమా రంగాలకు చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ఎలా ? ఉంటాయో కూడా వేణు స్వామి ముందే అంచనా వేసి చెబుతున్నారు. ప్రభాస్ – అనుష్క పెళ్లి గురించి నయనతార – విగ్నేష్ పెళ్లి గురించి కూడా వేణుస్వామి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ అనుకున్నంత గొప్పగా ఏం ? ఉండదని కూడా ఆయన సంచలనం రేపారు. అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత జీవితం గురించి కూడా వేణుస్వామి చెప్పిన విషయాలు హైలెట్ అవుతున్నాయి.
బాలయ్య బాబుని తాను చాలా దగ్గర నుంచి చూసానని… ఆయన చాలా మంచి వ్యక్తి అని వేణు స్వామి ప్రశంసలు కురిపించారు. బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మర్యాదగా చూసుకుంటారని ఆయనతో ఫోటోలు దిగినప్పుడు లేదా ఒక విషయం గురించి ప్రస్తావించినప్పుడు తిరిగి ఆయనే స్వయంగా ఫోన్ చేసి అది జరిగిందా ? లేదా అని కనుక్కుంటారని వేణుస్వామి చెప్పారు. చాలామంది మాస్క్ వేసుకుని ఉంటారని… బాలయ్య బాబు ఎప్పుడు ఆ ముసుగు లేకుండా ఉంటారని వేణు స్వామి చెప్పారు.
బాలయ్య బాబు గురించి బయట పబ్లిక్ గా…. మీడియాలో వచ్చేవి అన్ని అవాస్తవాలు అని… ఆయనలోని లోపల మనిషి చాలా మనసున్న మనిషి అని వేణు స్వామి చెప్పారు. ఇక బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలకు సైతం తానే ముహూర్తం పెట్టానని ఆయన తెలిపారు. బాలయ్యపై వేణుస్వామి వ్యాఖ్యలు బాలయ్య అభిమానులు బాగా వైరల్ చేస్తున్నారు.