టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల్లో బిజీ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. వరుసగా కొరటాల శివ దర్శకత్వంలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పాడు. కొరటాల శివ సినిమా గత ఆరు నెలలుగా సెట్స్ మీదకు వెళుతుందన్న ప్రచారం జరుగుతున్నా ఇప్పటకీ సెట్స్ మీదకు వెళ్లడం లేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో కొరటాల కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే విషయంలో చాలా లేట్ అవుతోంది. పైగా కొరటాలకు కెరీర్ పరంగా ఇదే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో చాలా పగడ్బందీగా కసరత్తులు చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాతో హీరోయిన్‌తో పాటు ఇతర తారాగణం ఎవరు ? అన్నదానిపై కూడా అందరూ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. హీరోయిన్ కోసమే గత నాలుగైదు నెలలుగా కొరటాల వెతకని అమ్మాయి లేదు.. చేయని ప్రయత్నం లేదనే అంటున్నారు.
అసలే పాన్ ఇండియా సినిమా… దీంతో హీరోయిన్ ఎంపిక కూడా కీలకం కానుంది. అటు నార్త్ జనాలకు కూడా హీరోయిన్ కనెక్ట్ అయ్యేలా ఉంటే సినిమాకు ప్లస్ అవుతుంది. సమంత, జాన్వీకపూర్, కియారా అద్వానీ ఇలా పలు పేర్లు వినిపించాయి. ముందుగా సమంతను కొరటాల సంప్రదించాడు. ఆమె గతంలో కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో నటించింది. అయితే సమంత ఇచ్చిన ఆన్సర్‌తో కొరటాలకు దిమ్మ తిరిగిందట. ఆమె ఏకంగా రు. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందట.
అయితే మేకర్స్ మాత్రం హీరోయిన్ కోసం రు 2.5 కోట్ల బడ్జెట్ వేసుకున్నారట. ఆ తర్వాత జాన్వీ – ఎన్టీఆర్ కాంబినేషన్ బాగుంటుందని కొరటాల జాన్వీని సంప్రదించారట. ఆమెను తెలుగులో పరిచయం చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఈ పాన్ ఇండియా సినిమాలో నటిస్తే బాగుంటుందని కొరటాల అడిగితే జాన్వీ ఏకంగా రు. 6 కోట్లు అడిగిందట.
జాన్వీకి సరైన హిట్ లేకపోయినా ఎందుకు ఇంత రేటు అడుగుతుందో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు. పైగా ఆమె తల్లికి స్టార్‌ను చేసింది తెలుగు సినిమా పరిశ్రమే. అయితే ఆమె మాత్రం తెలుగు సినిమా పరిశ్రమపై చిన్న చూపు చూస్తోందని.. మామూలుగానే యాట్యిట్యూడ్ చూపించే జాన్వీ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ వస్తే భారీగా డిమాండ్ చేసి పెద్ద తప్పే చేసిందన్న గుసగుసలు అయితే వస్తున్నాయి.