అన్నగారు సినీ జీవితంలో ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అర్ధరాత్రి 12 గంటల తర్వాత.. ఇంటి కి వచ్చే ఆయన.. మళ్లీ రెండు మూడు గంటల్లోనే.. రెడీ అయిపోయి.. వెళ్లిపోయేవారట. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో దాసరి నారాయణరావు.. సహా.. పలువురు చెప్పారు. అంటే.. ఆయన ఇంటికి, కుటుం బానికి కేటాయించిన సమయం చాలా చాలా తక్కువేనని చెప్పాలి. మరి ఇది నిజమేనా? అనేది ప్రశ్న. అయితే.. మరోనటుడు గుమ్మడి రాసిన పుస్తకంలో అన్నగారి గురించి.. ఈ విషయాలు వెల్లడించారు.
“రామారావుకు సినిమాల పట్ల ఎంత శ్రద్ధ, భక్తి ఉండేదో.. కుటుంబం విషయంలోనూ ఆయనకు అంతే శ్రద్ధ, బాధ్యత ఉండేది. ఆయన ఎవరికీ ఎలాంటి లోటు చేయలేదు. ఔట్ డోర్ షూటింగుల సమయంలో తప్ప.. మిగిలిన సమయాల్లో కుటుంబానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆదివారం పూట నేను ఆయన ఇంటికి వెళ్లేవాణ్ని. రంగారావు కూడా వచ్చేవాడు. ఆ సమయానికి ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు. “ అని గుమ్మడి వివరించారు.
ఈయన ఒక్కరే కాదు.. ఇదే విషయాన్ని అక్కినేని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. తాను కుటుం బానికి చాలా వరకు దూరంగా ఉండాల్సి వచ్చిందని.. దీంతో బాధ్యత అంతా కూడా.. అన్నపూర్ణమ్మ చూ సుకునేవారని ఆయన తెలిపారు. అయితే.. ఈ విషయంలో రామారావు గారు మాత్రం సాధ్యమైనంత వరకు తనే చూసుకునేవారని ఆయన చెప్పారు. పెద్ద కొడుకు హరికృష్ణను స్కూల్‌కు తీసుకువెళ్లి.. తీసుకువచ్చేవారని .. అసలు ఆ సమయం ఆయనకు ఎలా కుదిరేదో.. ఇప్పటికీ.. నాకు అర్ధం కాదని.. అక్కినేని చెప్పారు.
ఒక్క ఈ విషయంలోనే కాదు.. పెళ్లిళ్ల విషయంలోనూ.. అన్నగారు.. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారనేది వాస్తవం. మొత్తం 8 మంది పిల్లలకు ఆయనే దగ్గరుండి.. సంప్రదాయ బద్ధంగా.. వివాహాలు చేయించారు. అది కూడా ఉన్నత స్థాయి కుటుంబాల్లోని వారికే తన పిల్లలను ఇవ్వడం.. అదే సమయంలో కోడళ్లను ఎంచుకోవడం.. చేశారు. ఈ విషయంలో తన సోదరుడు.. త్రివిక్రమ రావు సాయం ఎక్కువగా తీసుకున్నారని.. గుమ్మడి చెప్పేవారు.
కానీ.. సినీ రంగంలో ఉన్న చాలా మంది కుటుంబాల్లో పిల్లలు దారితప్పినా.. అన్నగారి కుటుంబం మాత్రం సంప్రదాయంగా పెరిగిందని వివరించారు. దీనికి కారణం.. అన్నగారు చూపించినప్రేమ, బాధ్యతేనని వివరించారు.