అప్పట్లో వంశీ సినిమాలు వస్తున్నాయంటే ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. వంశీ సినిమాలు అంటేనే పల్లెటూరి హోయగాలు, పచ్చని వనరులు ఇలా ఎంతో స్పెషల్ ఉండేది. అలా వంశీకి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాల్లో కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ఒకటి. ఇంత పెద్ద టైటిల్ వంశీ లాంటి దర్శకులు మాత్రమే పెట్టి సాహసం చేయగలరు. హీరోగా రాజేంద్రప్రసాద్ పేరు సెలక్ట్ చేసుకున్నారు. ఇళయరాజాను మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నారు.
హీరోయిన్ నిషాంతి. పోస్టర్లు కూడా బయటకు వచ్చాయి. అయితే నిషాంతి హీరోయిన్గా చేయడం రాజేందప్రసాద్‌కు ఎందుకో నచ్చడం లేదు. ఇంతకు నిషాంతి అంటే ఎవరో కాదు భానుప్రియ చెల్లి శాంతిప్రియ. అయితే ఆమెను తమిళంలో నిషాంతి అనేవారు. అప్పట్లో ఆమె తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. ఇక రాజేంద్రప్రసాద్ నిషాంతి హీరోయిన్ అయితే తాను సినిమా చేయను అని పంచాయితీ పెట్టే వరకు వెళ్లింది.
వంశీ చాలా రోజులు చెప్పి చూశాడు. చివరకు రాజేంద్రుడు వినలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వంశీ హీరోనే మార్చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేశాడు. చివరకు రాజేంద్ర ప్రసాద్‌ను సినిమా నుంచి పీకేశాడు. ఈ గోలలోనే హీరోయిన్ నిశాంతిని కూడా తప్పించేశారు. అప్పటికప్పుడు సీనియర్ నటుడు నరేష్‌కు ఫోన్ చేసి నీతో సినిమా అనగానే గెంతుకుంటూ అక్కడకు వచ్చేశాడు. వంశీ – నరేష్ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది.
ఇక హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా ? అనుకున్నప్పుడు మద్రాస్‌లో ఓ సినిమా పోస్టర్ చూసి ఏవీఎం స్టూడియోకు వెళ్లాడు. ఆ సినిమా పోస్టర్లో ఉన్న అమ్మాయి బ్లాక్ కళ్లజోడు పెట్టుకుని వంశీని బాగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా ఆమె కళ్లు వంశీకి బాగా నచ్చేశాయట. ఆ తర్వాత ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఆమెది రాజమండ్రే అని తేలింది. ఆమె పేరు మాధురి.
తెలుగమ్మాయి.. అందులోనూ గోదారి పక్కన రాజమండ్రి అమ్మాయి అంటే వంశీ ఎందుకు వదులుకుంటాడు ? ఆమెనే ఫిక్స్ చేసేశాడు. ఫొటో సెషన్స్ పెట్టించేని హీరోయిన్గా బుక్ చేసి అడ్వాన్స్ కూడా ఇప్పించేశాడు. అలా చివరకు హీరోయిన్ ను మార్చాలని పట్టుబట్టిన రాజేంద్రుడే సినిమా నుంచి అవుట్ అయిపోయాడు. అప్పట్లో ఇదో సంచలనం అయ్యింది.