బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అమిషా పటేల్. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ సూపర్ హిట్ ను అందుకుంది. అంతకు ముందే హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలో తన అందచందాలతో దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. తన అందం అభినయంతో అభిమానుల మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ తరవాత మహేశ్ బాబు హీరోగా నటించిన నాని సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో కూడా అమిషా కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
అంతే కాకుండా ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమాలో కూడా ఆయనకు జోడీగా నటించి అలరించింది. టాలీవుడ్ లో తక్కువ టైంలోనే పవన్, మహేష్, ఎన్టీఆర్కు జోడీగా అమీషా జోడీ కట్టేసింది. స్టార్ హీరోలకు జోడీగా నటించినా కూడా టాలీవుడ్ లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. అమిషా ఆ తరవాత బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అక్కడ కూడా రాణించలేదు. చివరికి సినిమాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. సినిమాలకు దూరం అయినా అమిషా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. కానీ 45 దాటినా ఈ అమ్మడు పెళ్లి మాత్రం చేసుకోలేదు. అయితే కెరీర్ ప్రారంభంలో ఈ అమ్మడు దర్శకుడు విక్రమ్ తో లవ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తరవాత వీరి రిలేషన్ పై మళ్లీ ఎలాంటి వార్తలు కనిపించలేదు. కాగా ఇటీవల ఓ కాంగ్రెస్ నేత కుమారుడు బహిరంగంగా సోషల్ మీడియాలో ప్రపోజ్ చేశాడు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుమారుడు ఫైజల్ పటేల్ తో ఈ బ్యూటీ లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టుగా టాక్. వయస్సులో ఫైజల్ అమీషా కంటే చిన్నోడట.
ఇక సోషల్ మీడియాలో అమిషా పటేల్ ఫైజల్ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే డార్లింగ్ లవ్యూ అంటూ పోస్ట్ పెట్టింది. దానికి ఫైజల్ థాంక్యూ అమిషా ఈ సంధర్బంగా నీకు పబ్లిక్ గా ప్రపోజ్ చేస్తున్నా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. కానీ అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్ లు తీసి వైరల్ చేశారు. ఇక ప్రస్తుతం అమిషా వయసు 45 ఏళ్లు మరి ఇప్పుడైనా బద్రి బ్యూటీ పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.