హీరోయిన్ కృతి శెట్టి,, చాలా చిన్న అమ్మాయి . చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా వచ్చి..ఓ రేంజ్ లో సంపాదిస్తుంది. మెగా మేనల్లుడు హీరో వైష్ణవ తేజ్ నటించిన ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు పలు కమర్షియల్ యాడ్స్ లో అరాకొర కనిపిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. కానీ కృతి శెట్టి అనే పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోవడానికి కారణం మాత్రం ఉప్పెన సినిమానే. ఈ సినిమాలో అమ్మడు నటించిన తీరు జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. లేలేత అందాలు చూయిస్తూ.. అమాయకపు ముఖం.. కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్.. జనాల్లో కృతిపై ఆశలు పెంచేశాయి.
ఇక ఆ తర్వాత నాని శ్యాం సింగరాయి, నాగార్జున బంగార్రాజు… సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆశ్చర్య, ఏమిటంటే.. నాని శ్యామ్ సింగరాయ్ తన రెండో సినిమాకి అమ్మడు కోటి 50 లక్షలు రెమ్యూనిరేషన్ గా అందుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి రెండో సినిమాకి ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఒకవేళ హీరోయిన్స్ డిమాండ్ చేసిన మేకర్స్ అంత ఇవ్వలేరు .
కానీ కృతిలో ఏం చూసారో ఏమో అడగ్గానే కోటి 50 లక్షలు చేతుల్లో పెట్టేశారు నాని శ్యామ్ సింగరాయ్ మూవీ డైరెక్టర్స్. అఫ్ కోర్స్ సినిమా హిట్ అయింది నిర్మాతలకు లాభాలు వచ్చాయి.దాదాపు నాగార్జున బంగార్రాజు సినిమాకు కూడా కృత్తి శెట్టి అంతే పారితోషకం పుచ్చుకున్నట్టు అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి . అంతేనా ఈ మూడు సినిమాలు రిలీజ్ అయ్యే మధ్యకాలంలో అమ్మడు పలు బుల్లితెర ప్రోగ్రాంలకి అటెండ్ అయ్యి బాగానే సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమైన ఓ సీరియల్ కి అమ్మడు ప్రమోట్ చేసినందుకు గాను సుమారు రెండు కోట్లు తన ఖాతాలో వేసుకున్నట్లు అప్పట్లో రేంజ్ లో వార్తలు అయ్యాయి.
కాగా ఇప్పటివరకు కృత్తి చేసింది ఐదు సినిమాలే. కానీ చేతిలో ఆరు సినిమాలు రెడీగా పెట్టుకుంది . వీటి అన్నింటికి కృతి దాదాపు రెమ్యూనరేషన్ గా కోటి 50 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. మరీ ముఖ్యంగా సూర్య సినిమాకి రెండు కోట్లు పైగానే పుచ్చుకుంటుందట . ఈ క్రమంలోనే ఇంత డబ్బులు ఈ చిన్న వయసులో కృతి ఏం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వగాఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయట పడింది. కృతిశెట్టి తన పారితోషకాని మొత్తాన్ని అమ్మకే ఇచ్చేస్తుందట. ఒక్క రూపాయి కూడా తను తీసుకోదట . ఆ డబ్బులను కృతి మదర్ ..కృతి డ్రీమ్ హౌస్ నిర్మించుకోవడానికి దాచుతుందట. అందుకే ఇంత చిన్న వయసులోనే ఓ పక్క చదువును మరోపక్క సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నెట్టుకు రావడానికి ట్రై చేస్తుందట. అంతేకాదు సినిమాల్లో కొంచెం బోల్డ్ సీన్స్ ఉంటే అమ్మడు ఎక్కువ పారితోషకం డిమాండ్ చేస్తుందన్న రూమర్ కూడా ఉంది. ఏది ఏమైనా ఇంత చిన్న ఏజ్ లోనే కృతి తెలివితేటలకు హాట్సాఫ్ అంటున్నారు ఆమె అభిమానులు.