Moviesవావ్: జాన్వీ సూపర్ కేక పెట్టించే డెసీషన్..అమ్మనే మించిపోయింది..అప్రిషియేట్ చేయాల్సిందే..!?

వావ్: జాన్వీ సూపర్ కేక పెట్టించే డెసీషన్..అమ్మనే మించిపోయింది..అప్రిషియేట్ చేయాల్సిందే..!?

యస్.. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే అతిలోకసుందరి శ్రీదేవి ముద్దులు కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లోనే సినిమాలు చేసిన టాలీవుడ్ లో కూడా అమ్మ పుణ్యమా అంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆఫ్ కోర్స్ సోషల్ మీడియాలో జాన్వీ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

కాగా గత కొంతకాలంగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదిగో ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని.. కాదు కాదు విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని బోలెడన్ని వార్తలు వచ్చాయి . కానీ రీసెంట్ గా ఆమె సినిమా ప్రమోషన్స్ లో ఆ విషయాలన్నీ కొట్టి పడేసింది. తనకు సినిమా ఆఫర్ వచ్చిన విషయం నిజమే కానీ.. అది తారక్ తో కాదని విజయ్ దేవరకొండ తో అని చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాల్లో మొదటిగా హీరోయిన్ అనుకున్నింది జాన్వీ కపూర్ నేనట, ఈ విషయం కరణ్ జోహార్ కూడా అఫీషియల్ గా చెప్పారు. పూరి జగన్నాథ్ స్టోరీ రాసుకునేటప్పుడే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ అయితే బాగుంటుందని జాన్వీ కపూర్ కి బోనీ కపూర్ కి కథ కూడా వినిపించాడట . కానీ అప్పటికే పలు సినిమా షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న జాన్వీ..ఈ సినిమాను వదులుకుంది. ఈ సినిమా రిజల్ట్ చూశాక జాన్వీ సినిమా వదులుకోవడం కరెక్టే మంచి పని చేసింది అంటున్నారు శ్రీదేవి అభిమానులు.

జాన్వినే కాదు గతంలో ఇలా శ్రీదేవి చాలా ఫ్లాప్ సినిమాలు నుంచి తప్పించుకుంది. ఆమె కోసం డైరెక్టర్ రాసుకున్న కథను ఆమెకు వినిపించగా.. పలు సినిమాలతో బిజీగా ఉండి ఆ సినిమా నుండి తప్పుకోవడం.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అవడం శ్రీదేవి కెరియర్లో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు అలాగే జాన్వి కూడా లైగర్ ప్లాప్ నుంచి తప్పించుకొని సేఫ్ జోన్ లో ఉంది అంటూ శ్రీదేవి అభిమానులు సంబరపడుతున్నారు. మరి చూడాలి జాన్వీ కపూర్ తెలుగు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో ఏమో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news