సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే హీరోయిన్స్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేదాని పై చాలా మంది హీరోయిన్లు నోరు విప్పి అసలు నిజాలు బయటపెట్టారు. కొందరు క్యాస్టింగ్ కౌచ్ అని.. కొందరు హీరోయిన్స్ కి మర్యాద ఇవ్వరని.. ఇంకొందరు సినీ ఇండస్ట్రీలో జెండర్ డిఫరెన్స్ చూస్తారని.. హీరోని ఒకలాగా హీరోయిన్ మరొక లాగా చూస్తూ ఉంటారని చెప్తుంటారు . ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మలు ఇలా చెప్పుకొచ్చారు.కాగా రీసెంట్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి .
ఇప్పటివరకు పూజ హెగ్డే సోషల్ మీడియాలో ఎప్పుడు కానీ, ఇంటర్వ్యులో కానీ.. సినిమా ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడింది లేదు. ఫస్ట్ టైం తన కెరియర్ లోనే పూజ హెగ్డే సినీ ఇండస్ట్రీపై నెగటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీవర్గాలలో సంచలనంగా మారింది. ఇన్నాళ్లు నోరు తెరవని పూజ వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు పడేసరికి ఒక్కొక్కటిగా తన మనసులోని మాటను బయటపెడుతుంది. సినీ ఇండస్ట్రీపై ఒక్కొక్కటిగా నెగటివ్ కామెంట్స్ చేస్తుంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.
వరుస ఫ్లాప్ సినిమాలతో ఫెడ్ అవుట్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న పూజా హెగ్డే ..ప్రెజెంట్ బాలీవుడ్ లో మూడు సినిమాలు.. టాలీవుడ్ లో ఓ సినిమా ..కోలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. ఈ క్రమంలోని పూజా హెగ్డే రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండాలి అంటే ..హీరోయిన్ గా రావాలి అన్న అందరూ అదృష్టం బాగుండాలి.. టైం కలిసి రావాలి.. లక్ ఉండాలి ..కష్టపడాలి అంటుంటారు . అవన్నీ ఉన్నా ,
కానీ ,,ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదుగుతారో లేదో చెప్పలేం. కానీ ఓర్పు ఉండాలి, ఓర్పుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా హీరోయిన్ అవ్వగలరు . టాలెంట్ ఉండి ఓపిక ఉంటే హీట్ పడుతుంది .ఇండస్ట్రీలో హీరోయిన్ గాఎదుగుతారు. మనకు తెలిసిందే పూజా హెగ్డే కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడింది. ఫైనల్ గా హిట్టు కొట్టి హీరోయిన్ అనిపించుకున్నా.. మళ్ళీ అదే ఐరన్ లెగ్ పోజీషన్ కి చేరుకుంది అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.