సురేఖ వాణి.. ఈ పేరు పెద్దగా కొత్త పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటి ఆంటీగా ..హీరోయిన్ కి తల్లిగా,, హీరోకి వదినగా,, బోలెడు సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి అభిమానులను సంపాదించుకుంది . తెరపై ఈమెను చూస్తే ఎవరైనా సరే ఆ కట్టుబోట్టుకు ఫిదా అవ్వాల్సిందే. చూడ చక్కగా తెలుగింటి అమ్మాయిల కాదు కాదు ఆంటీల ఎంతో అద్భుతంగా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది.
ఇదంతా ఆమె ఓ సైడ్ అందమే. సురేఖవానికి మరో సైడ్ కూడా ఉంది. తెరపై ఎంత ట్రెడిషనల్ గా కనిపిస్తుందో ..తెర వెనుక్స్ అంతే హాట్ గా వల్గర్ గా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో సురేఖ వాణి తన కూతురితో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనదైన స్టైల్ లో నటిస్తూ కూతురుతో రీల్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. మనకు తెలిసిందే సురేఖ వాణి భర్త మరణించారు. అప్పటినుంచి ఆమె సింగిల్ గానే ఉంటుంది . రెండో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదని చాలా ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
కానీ తన కూతురు సుప్రీత మాత్రం ఆమెకి ఎలాగైనా రెండో పెళ్లి చేయాలని తెగ ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేఖ వాణి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సురేఖ వాణి మాట్లాడుతూ ..”నాకైతే రెండో పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ప్రజెంట్ లేదు. భవిష్యత్తులో వస్తుందేమో చెప్పలేను. కానీ నాకు భర్త కన్నా బాయ్ ఫ్రెండ్ ఏ కావాలి అనిపిస్తుంది. పెళ్లి కంటే కూడా మంచి బాయ్ ఫ్రెండ్ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.
నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉండాలి అంటే కావాల్సిన లక్షణాలు.. ఎలా ఉండాలంటే.. చాలా హైట్ గా ఉండాలి, మంచి ఫిజిక్ ఉండాలి, మంచి మనసు ఉండాలి, కొంచెం గడ్డం ఉండాలి, బాగా డబ్బులు సంపాదించుకొని ఉండాలి. నేను ఏం అడిగినా కాదనకుండా కొన్ని ఇచ్చే కెపాసిటీ ఉండాలి.. నన్ను హ్యాపీగా చూసుకోవాలి” అంటూ సురేఖ వాణి చెప్పుకొచ్చింది. దీంతో ఈ వయసులో మీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి మేడమ్ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.