Moviesఆ సీనియ‌ర్ హీరో కొడుకుతో హీరోయిన్ పెళ్లి.... అంతా సంథింగ్ సంథింగ్‌..!

ఆ సీనియ‌ర్ హీరో కొడుకుతో హీరోయిన్ పెళ్లి…. అంతా సంథింగ్ సంథింగ్‌..!

కోలీవుడ్లో సీనియర్ హీరో కార్తీక్ అంటే ఒకప్పుడు అమ్మాయిలా కలల రాకుమారుడు. 1989వ దశకంలో కార్తీక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. కార్తీక్ నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి. కార్తీక్ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో విపరీతమైన మద్యం, డ్రగ్స్‌కు అలవాటు పడటంతో కెరీర్లో ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు. ఇక ఇప్పుడు ఆయన తనయుడు గౌతమ్ కార్తీక్ తండ్రి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ కోలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యంగ్ హీరోలలో నవరస నాయకుడు అన్న పేరు గౌతమ్ కార్తీక్ కు వచ్చింది. చాలా తక్కువ సమయంలోనే హీరోగా మంచి పేరు వచ్చింది.

 

అయితే ఇప్పుడు గౌతమ్ కార్తీక్ ప్రేమ వ్యవహారంపై కోలీవుడ్ మీడియాలో హాట్‌టాపిక్ గా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ మలయాళ న‌టి మంజీమా మొహన్‌తో గౌతమ్ ప్రేమలో ఉన్నాడని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. మంజీమా మోహన్ తెలుగులో నాగచైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్‌ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక గౌతమ్ కార్తీక్ – మంజిమా కలిసి మోహన్ దేవరాట్టం సినిమాలో జంటగా నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నారన్న ప్రచారం అయితే తమిళనాట‌ గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రేమ వార్తలపై గౌతమ్ – మంజిమా ఎప్పుడు స్పందించలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో గౌతమ్ కార్తీక్ తాజాగా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ ఏడాది తాను వివాహం చేసుకోబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. అయితే అమ్మాయి ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అయితే తాను మంజీమా కలిసి ప్రేమలో ఉన్నామని… త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని వస్తున్న వార్తల ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. తాను నటుడుగా ఎంతో సాధించాలని సినిమా రంగంలోకి వచ్చానని.. అయితే కొన్ని అవాంతరాలు తనకు ఎదురయ్యాయని గౌతమ్ చెప్పాడు.

ఇకనుంచి తాను కథ‌ల ఎంపికపై బాగా శ్రద్ధ తీసుకుంటానని… మంచి కథాబలం ఉన్న సినిమాలే చేయాలని భావిస్తున్నట్టు చెప్పాడు. ఈ ఏడాది తన పెళ్లి ఉంటుందని గౌతమ్ చెప్పినా ఆ వధువు ఎవరన్నది చెప్పకపోవడంతో… ఇప్పుడు అంతా సస్పెన్స్ గా ఉంది. ఏదైనా గౌతమ్ – మంజిమా మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే అందరూ అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news