Moviesచిత్రం హీరోయిన్ రీమాసేన్‌కు ఆ స్టార్ హీరోతో ల‌వ్ బ్రేక‌ప్ ......

చిత్రం హీరోయిన్ రీమాసేన్‌కు ఆ స్టార్ హీరోతో ల‌వ్ బ్రేక‌ప్ … చివ‌ర‌కు సినిమాల‌కే గుడ్ బై…!

రీమాసేన్… 1981లో కొల్‌కతాలో పుట్టిన రీమా తమ కుటుంబం ముంబైకి షిఫ్ట్ అవడంతో మెల్లిగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. తొలుత కొన్ని వాణిజ్య ప్రకటనలో నటించగా ఆ తర్వాత తెలుగు సినిమా న్‌గా నటించింది. ఇక మనసంతా నువ్వే సినిమాతో మరోసారి ఉదయ్ తో జత కట్టిన రీమాసేన్ ఆ తర్వాత కాలంలో తమిళ పరిశ్రమకు షిఫ్ట్ అయింది.

హిందీ సినిమా పరిశ్రమకు కూడా తన అదృష్టం పరీక్షించుకోగా అక్కడ పెద్దగా విజయం సాధించకపోవడంతో తమిళ పరిశ్రమలోనే కొనసాగాలని రీమాసేన్ నిర్ణయించుకుంది. ఆ క్రమంలో అక్కడ వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది. అలాగే ఆమె నటించిన అన్ని తమిళ సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో రీమాని తమిళ ప్రేక్షకులు బాగానే ఆదరించారు.

ఇక తెలుగు సినిమా పరిశ్రమలో ఉదయ్ కిరణ్‌కి బెస్ట్ జోడి అనిపించుకున్న రీమాసేన్ తమిళంలో విశాల్ తో ఎక్కువగా నటించి మంచి జోడీగా పేరు సంపాదించుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పొగరు, ప్రేమ చదరంగం వంటి సినిమాలు ఘనవిజయాన్ని సాధించాయి. ఇక 2006లో ఒక అశ్లీల చిత్రానికి గాను కోర్టు మెట్లు కూడా ఎక్కింది రీమాసేన్. ఒక మ్యాగజిన్ ముఖచిత్రం పై అసభ్యకరమైన రీతిలో శిల్పా శెట్టితో సహా రీమాసేన్ ఫోటోలకు ఫోజులు ఇవ్వగా అవి కాస్త కాంట్రవర్సీ అయ్యాయి.

ఇక ఆ తర్వాత కాలంలో ఆ కేసు కొట్టేయగా రీమాసేన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఏడాది పాటు ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. ఇక ఇలాంటి విషయాలే కాకుండా ఎఫైర్ల విషయంలోనూ రీమాసేన్ వార్తల్లో నిలిచింది. హీరో విశాల్ తో ప్రేమ చదరంగం సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టుగా వీరిద్దరూ కలిసి ఎప్పుడు మీడియా కంట కనిపించడంతో ఆ వార్తలు నిజమని అందరూ నమ్మారు.

కొన్నాళ్ల పాటు బాగానే వీళ్లిద్దరూ ప్రేమ మైఖంలో మునిగి తేలారని అప్పటి మీడియా కోడై కూసింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ రీమాసేన్ సినిమా కెరియర్‌తో పాటు విశాల్‌ ప్రేమకు కూడా బ్రేకప్ చెప్పి నార్త్ ఇండియా వెళ్ళిపోయింది. అక్కడ శివకరణ్ సింగ్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యింది రీమాసేన్. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news