Moviesఓరెయ్..నీకు అస్సలు బుద్దుందా..? స్టార్ హీరో నీచపు మాటల పై ఫ్యాన్స్...

ఓరెయ్..నీకు అస్సలు బుద్దుందా..? స్టార్ హీరో నీచపు మాటల పై ఫ్యాన్స్ ఫైర్..!!

సినీ ఇండస్ట్రీలో స్టార్ పోజీషన్ లోకి వచ్చాక మనం మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. వన్స్ టంగ్ స్లిప్ అయ్యి ఒక మాట మాట్లాడేసాక నెటిజన్స్ చేత ట్రోల్ అవ్వడం తప్పిస్తే ఏం చేయలేం. సారీ చెప్పిన ఫలితం ఉండదు . నెటిజన్స్ ఆ రేంజ్ లో ఆడేసుకుంటారు. ట్రోల్ చేస్తారు . ప్రజెంట్ అలాంటి పొజిషన్ నే ఫేస్ చేస్తున్నాడు స్టార్ వారసుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్. మనకు తెలిసిందే రణబీర్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గానేనమోదు చేశాయి.

అయితే రణబీర్ కపూర్ లో కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ..భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాని బ్రహ్మాస్త్రం అనే పేరుతో తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభించిన రణబీర్ కపూర్ రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియా భట్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు.

ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ ..టాలీవుడ్ కింగ్ నాగార్జున.. నాగిని బ్యూటీ మౌని రాయ్.. ఇంకా చాలామంది తదితర నటులు కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలియా భట్, అయాన్ ముఖర్జీ , రణబీర్ కపూర్ ఇన్ స్టా లైవ్ లో నెటిజన్స్ తో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇంత పెద్ద భారీ స్థాయి ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రహ్మాస్త్రాకు మీరు అస్సలు ప్రమోషన్స్ సరిగ్గా చేయడం లేదంటూ ప్రశ్నించారు.

” మీరు ఎందుకు ఈ సినిమాను లైట్ తీసుకుంటున్నారు. ఈ సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు” అని అడిగాడు. దీనిపై అలియా సమాధానం ఇస్తుండగానే రణబీర్ కపూర్ మధ్యలోకి ఎంటర్ అయ్యి ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. ” మేము ఈ చిత్రాన్ని ఎందుకు ప్రమోట్ చేయలేకపోతున్నాము అంటే.. ఇక్కడ ఒకరు భారీగా పెరిగిపోతున్నారంటూ.. ఆలియా బేబీ బంప్ పై చూశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయినా ఆలియా కోపానికి గురైంది .కానీ, కంట్రోల్ చేసుకొని కూల్ అయింది. రణబీ ఆ కోపాన్ని గమనించి “జస్ట్ జోక్ చేశా” అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా అయిపోయాయి. దీనిపై కొందరు అలియా అభిమానులు రణబీర్ పై మండిపడుతున్నారు. “అసలు నీకు బుద్ధుందా? ఒక ఆడదానిపై చేయాల్సిన కమెంటేనా.. నువ్వు అసలు తండ్రి వేనా.. తండ్రి కాబోతున్న ఆనందం నీ కళ్ళల్లో లేదే.. ఒక ప్రెగ్నెంట్ మహిళపై ఇలాంటి బాడీ షేవింగ్ కామెంట్ చేస్తావా..?” అంటూ మండిపడుతున్నారు. దీంతో పబ్లిక్ గా ఆయన ఆలియా బేబీ బంప్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారానే రేపుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news