నిత్యా మీనన్‌తో సినిమా చేయాలంటే కొన్ని ఖచ్చితమైన కండీషన్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటుంటారు. కథ, కథనాల విషయంలో అంత త్వరగా సంతృప్తి చెందదనే మాట వినిపిస్తుంది. త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ అయినా కూడా షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ తనకి నచ్చినట్టు లేవని మార్చితేగానీ, చేయనని పట్టుపట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ సినిమా సమయంలో కూడా ఇద్దరికీ విబేధాలు వచ్చాయట.
అందుకే, ఆడియో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రముఖ గాయని, చిత్ర గారు పాడిన అంత ఇష్టం అనే పాట ఆల్బంలో మాత్రమే ఉంటుంది తప్ప. సినిమాలో ఉండదు. దీనికి కారణం త్రివిక్రమ్‌తో నిత్యాకి వచ్చిన విబేధాలే అని చెప్పుకున్నారు. మామూలుగానే నిత్య మీనన్‌ని కాస్త రొమాంటిక్ సీన్స్ చేయమన్నా, ఎక్స్‌ఫోజింగ్ చేయమన్నా ససేమిరా అంటుంది. అంతేకాదు, గట్టిగా పట్టుపట్టి ఈ సీన్స్ చేయమంటే సినిమా ఆ క్షణం వదిలేయడానికి కూడా వెనకాడదు.
అయితే, తనపట్ల తప్పుగా ప్రవర్తించినా కూడా గట్టిగానే సమాధానం చెబుతుందన్న టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఓ సినిమా దర్శకుడికి ఈ విషయంలో వార్నింగ్ కూడా ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తుంటాయి. ఆ సినిమా గుండెజారి గల్లంతయ్యిందే. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకు కొండా విజయ్ కుమర్ దర్శకుడు. రొమాంటిక్ మూవీగా వచ్చి మంచి కమర్షియల్ హిట్ సాధించింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు నిత్యాను పర్సనల్‌గా కలుద్దామని అడిగాడట.
దీనర్థం ప్రైవేట్‌గా కలుద్దామని అడిగాడట. అది నచ్చక చేయి చేసుకోబోయిందని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపించాయి. అప్పట్లో లోలోపల ఇది కాస్త హాట్ టాపిక్‌గా కూడా మారింది. అది నిజమో కాదో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వేరే సందర్భం ఏదొచ్చినా దీని గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. అందుకే, నిత్యా జోలికి అంత త్వరగా ఎవరూ వెళ్ళడానికి సాహం చేయరని టాక్ వినిపిస్తుంది.