లైగర్..లైగర్..లైగర్..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ..నెక్స్ట్ బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు లైగర్ సినిమాతో. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా..ఆగస్టు 25 న గ్రాండ్ ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో స్టార్ డాటర్ బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే నతిస్తుంది. ఈ సినిమా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనదైన స్టైల్లో విభిన్న రీతిలో తెరకెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ పతాకంపై కరణ్ జోహర్-పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు
కాగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ , ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సినిమా గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా కథలాగే ఉందంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ స్పందించారు ఈ సినిమా అమ్మ నాన్న తమిళ అమ్మాయి మూవీకి రిలేటెడ్ కాదని ఆ సినిమాకు ఈ సినిమా రీమికే కాదు అని తేల్చి చెప్పారు. ఈ కథను ఇప్పటివరకు మీరు ఎవరు చూసి ఉండరని పూరి జగన్నాథ్ డిఫరెంట్ స్టైల్ లో కొత్త పద్ధతిలో తెరకెక్కించారని ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆయన ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.
అయితే, ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు చాలా వాల్యూ ఉన్నట్టు ట్రైలర్ లోనే అర్థమైపోతుంది. లైగర్ అమ్మగా రమ్యకృష్ణ జీవించేసింది. ఈ పాత్రలో ఆమె తప్పితే మరొకరిని ఉహించుకోలేకపోతున్నారు జనాలు. కానీ అసలు విషయం ఏమిటంటే , ఈ పాత్ర కోసం ముందుగా పూరీ జగన్నాథ్ అనుకున్నింది రమ్యకృష్ణను కాదట. ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ రవీనా టండనాను అనుకున్నట్లు సమాచారం. అయితే పూరీ జగన్నాథ్ ఆమెకు కథ చెప్పడంలో విఫలమైనట్టు..
ఆ కారణంగానే ఆమె ఈ సినిమాను వదులుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆమె గాని ఈ పాత్రకు ఓకే చెప్పుంటే కచ్చితంగా రమ్యకృష్ణ కన్నా వంద శాతం పూర్తి న్యాయం చేసుండేది. జనాలు ఇప్పటికే కేజీఎఫ్ 2 లో రవీనాటండన పాత్ర చూసి జనాలు మైమరిచిపోయారు. ఆ పాత్రలో ఈమెని ఊహించుకుంటే ఖచ్చితంగా లైగర్ అమ్మగా చించేసి ఉండేది. తద్వారా సినిమాకు భారీ హైప్ ఇచ్చేది.. అలాగే సినిమా హిట్ అయ్యేది అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చూడాలి రమ్యకృష్ణ ఏ మేరకు ఈ పాత్రలో మెప్పిస్తుందో..!?