Movies' కార్తీకేయ 2 ' 5 రోజుల క‌లెక్ష‌న్స్‌... డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్...

‘ కార్తీకేయ 2 ‘ 5 రోజుల క‌లెక్ష‌న్స్‌… డ‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ బాబు..!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన కార్తీకేయ 2 సినిమా పలుమార్లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు గ‌త శ‌నివారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తొలి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో ఈ సినిమాకు రోజు రోజుకు థియేట‌ర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా నార్త్‌లో కూడా ఈ సినిమా భారీ వ‌సూళ్లు కొల్ల‌గొడుతోంది. నార్త్‌లో అటు అమీర్‌ఖాన్‌, అక్ష‌య్ కుమార్ సినిమాలు థియేట‌ర్ల‌లో ఉన్నా కూడా ఈ సినిమా ఆ రెండు సినిమాల‌ను డామినేట్ చేయ‌డం విచిత్రం. అక్క‌డ ట్రేడ్ వ‌ర్గాలు సైతం నిఖిల్ కార్తీకేయ 2 వ‌సూళ్లు చూసి షాక్ అవుతున్నాయి.

శ్రీకృష్ణ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి వచ్చిన ఈ సినిమా కథ‌, క‌థ‌నాల‌కు ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అవుతున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాకు స్క్రీన్లు, షోల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఐదు రోజుల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా అదిరిపోయే వ‌సూళ్లు సొంతం చేసుకుంది.

నాలుగో రోజు రు. 2. 17 కోట్లను అందుకున్న ఈ సినిమా ఐదో రోజు కూడా 1.61 కోట్ల షేర్ సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణ చూస్తే టోట‌ల్‌గా రు. 24 కోట్ల గ్రాస్‌.. రు. 15.32 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక క‌ర్నాక‌ట‌, రెస్టాఫ్ ఇండియాలో 1.23 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో ఈ సినిమా రు 2.75 కోట్లు సొంతం చేసుకుంది. ఇక నార్త్‌లో హిందీ వ‌ర‌కు చూస్తే 2.20 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో 2.75 కోట్లు రాబ‌ట్టింది.

ఓవ‌రాల్‌గా ఈ సినిమాకు 12.80 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా… రు. 13 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్ అయిన కార్తీకేయ 2 ఇప్ప‌టికే రు. 9 కోట్ల‌కు పైగా నిక‌ర‌లాభం సొంతం చేసుకుంది. ఇక రెండు రోజుల పాటు శ్రీకృష్ణాష్ట‌మి హ‌డావిడి ఉండ‌డంతో ఆరో రోజు, ఏడో రోజు కూడా మంచి వ‌సూళ్లు రానున్నాయి. సెకండ్ వీకెండ్‌లో కూడా మంచి వ‌సూళ్లు న‌మోదు చేస్తే కార్తీకేయ 2కు దిమ్మ‌తిరిగిపోయే లాభాలు రానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news