సినీ ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి చాలా కామన్. స్టార్ హీరో హీరోయిన్ల భార్యలు భర్తలు.. స్టార్ డైరెక్టర్ల భార్యలు..ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారు.కానీ, జనాలు మాత్రం లైట్ గా తీసుకోరండోయ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి స్టార్ హీరోయిన్ కి ఎఫైర్ అంటూ గత కొన్నేళ్ళుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ స్టార్ డైరెక్టర్ హీరోయిన్ ఎవరో మీకు తెలిసిపోయింది కదా. వాళ్లే ఛార్మి టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. వీళ్ళ మధ్య ఎఫైర్ ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి కానీ జనాలు మాత్రం వీళ్ళ మధ్య ఏదో బంధం ఉందని గట్టిగా నమ్ముతున్నారు. దానికి వాళ్ళ బిహేవియర్ కూడా ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం ..చేతిలో చేతులు పట్టుకొని తిరగడం జనాల అనుమానాలకు ప్లస్ గా నిలిచాయి.
రీసెంట్ గా వీరిద్దరూ కలిసి నిర్మిస్తున్న సినిమా లైగర్. స్టార్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్
కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పూరి జగన్నాథ్ పలు బడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ తన వ్యక్తిగత జీవితాల గురించి ఓపెన్ అప్ అయ్యారు. జనరల్ గా పూరి జగన్నాథ్ ఏ ఇంటర్వ్యూలోను తన ఫ్యామిలీ గురించిన విషయాలు బయటపెట్టడు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం తన పర్సనల్ విషయాలను బయటపెట్టాడు. ఈ క్రమంలోనే తనకు హీరోయిన్ ఛార్మీకు మధ్య ఏదో సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలపై అధికారికంగా స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ..” హీరోయిన్ ఛార్మికు నాకు ఏదో సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు నేను చూసిన చూడనట్టే వెళ్లిపోతాను ఎందుకంటే మా మధ్య ఏ సంబంధం లేదు. ఉన్నదల్లా ఫ్రెండ్ షిప్. ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు నుంచే తెలుసు. చాలా మంచి అమ్మాయి. గొప్ప నటి ఆమెతో సినిమాలు కూడా చేశాను. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాము. ఈ విషయం మా ఇళ్లల్లో ని వారికి తెలుసు. మా పిల్లలకి తెలుసు.. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ..మీడియాలో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చిన ప్రతిసారి నవ్వుకుంటాం..ఆ తర్వాత లైట్ తీసుకుంటాం.
సరే మీరు అనుకున్నట్టే మా మధ్యే ఎఫైర్ ఉందని అనుకుందాం. మరి ఎఫైర్ అయితే ఇన్ని సంవత్సరాలు ఉంటదా. మా పని అయిపోగానే తీరిపోయేదిగా. ఆకర్షణ తీరిపోతుందిగా. మాది అది కాదు అంటే ఫ్రెండ్ షిప్ అనేగా అర్థం. ఇప్పటివరకు మేము కలిసి ఉన్నాం అంటే మా మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్ షిప్ ఉంది. ఎందుకంటే ఆకర్షణ అనేది చాలా తక్కువ రోజులు ఉంటుంది. స్నేహం ఒక్కటే లైఫ్ లాంగ్ ఉంటుంది. మేము ఎప్పటికీ స్నేహితులుగా శాశ్వతంగా కలిసి ఉంటాం అది ఎప్పటికైనా సరే ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎప్పటికీ ..మేము స్నేహితులం..” అంటూ గట్టిగా చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్ .