అక్కినేని మనవడు నాగచైతన్య తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దా సినిమాలో చైతు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా తెలుగులో థ్యాంక్యూ, అటు బాలీవుడ్లో లాల్‌సింగ్ చద్దా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతు రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో కాస్త డిజప్పాయింట్ చేశాడు. ఇక బాలీవుడ్ లో ఫస్ట్ టైం సినిమా చేయడంతో అక్కడ ఈ సినిమా ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే చైతు తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చాడు.
తన ఫస్ట్ క్రష్‌గా తన తండ్రి సినిమాలో నటించిన హాట్ హీరోయిన్ పేరు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇంతకు చైతుకు ఫస్ట్ క్రష్ ఎవరో కాదు.. ఒకప్పటి ప్రపంచ సుందరి, మాజీ హీరోయిన్ సుస్మితాసేన్. తనకు ఇష్టమైన హీరోయిన్ల గురించి చెప్పిన చైతు తన ఫస్ట్ క్రష్ సుస్మిత అంటూ చెప్పాడు. ఇక సుస్మిత చైతు తండ్రి నాగార్జునతో ఓ సినిమా చేసింది. ఆమె ప్రపంచ సుందరి అయిన వెంటనే నేషనల్ వైడ్‌గా తిరుగులేని క్రేజ్ వచ్చింది.
అప్పుడే భారీ బడ్జెట్ సినిమాల నిర్మాత కేటి. కుంజుమోహన్ నిర్మించిన రక్షకుడు సినిమాలో ఆమె నటించింది. అయితే భారీ బడ్జెట్‌తో వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ సినిమా టైంలో చైతు హైస్కూల్ స్టేజ్ చదువుతున్నాడు. మరి సుస్మితలో మనోడికి ఏం నచ్చిందో కాని ఆమెకు పడిపోయాడు. ఆమే తన ఫస్ట్ క్రష్ అంటూ రివీల్ చేశాడు. ఇక బాలీవుడ్ హీరోయిన్ల గురించి చెపుతూ కత్రినాకైఫ్ తన దృష్టిలో నిజమైన అందగత్తె అంటూ కితాబిచ్చాడు.
ఇక లాల్‌సింగ్ చద్దా సినిమాలో నటించిన కరీనాకపూర్ మేడమ్ కూడా తనకు చాలా ఇష్టం అన్నాడు. అలియాభట్ నటనకు తాను మెస్మరైజ్ అయ్యానని.. అలాగే ప్రియాంక చోప్రా కూడా తనకు ఇష్టం అని చెప్పాడు. ఏదేమైనా చైతుకు నచ్చిన హీరోయిన్ల జాబితా చాలా పెద్దదే..!