కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా యూత్ గుండెల్లో పాగా వేసింది హెబ్బా పటేల్. రాజ్ తరుణ్ హీరోగా సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. యూత్ ఆడియన్స్ కి కావాల్సిన కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులు చూడగలిగే కథ, కథనాలతో రూపొందించారు. ఈ సినిమా మొదటిరోజు నుంచే బ్లా బస్టర్ హిట్ అనే టాక్ రావడంతో అందరి దృష్ఠీ క్యూట్‌గా ఉన్న హెబ్బా పటేల్ మీద పడింది. మంచి నాజూకు శరీరాకృతి..యువ హీరోలకు సరిపోయే పర్సనాలిటీ.
దర్శకనిర్మాతలు మాత్రమే కాదు, మన యువ హీరోలకు కావాల్సింది ఇలాంటు గులాబ్ జామూన్ లాంటి అమ్మాయే. ఎప్పటికప్పుడు కొత్త సరుకు వస్తేనే సినిమాలు యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటాయి. అందుకే, కొత్త సినిమా అంటే మన మేకర్స్ ముంబై వెళ్లి కొత్త కొత్త మోడల్స్‌ను పట్టుకొస్తుంటారు. ఒకటి రెండు సినిమాలకి వీరి రెమ్యునరేషన్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి ప్రాజెక్ట్‌కి అన్ని విధాలా కలిసి వస్తుంది. హెబ్బాను అందుకే తీసుకున్నారు. అమ్మడు కుమారీ 21 ఎఫ్ లో చూపిన పర్ఫార్మెన్స్కి స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు.
వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ, ఏ ఒక్కటీ కుమారి 21 ఎఫ్ లాంటి సక్సెస్ కాలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపయ్యాయి. మరీ ముఖ్యంగా కృష్ణం శెట్టి అయేధ్యకుమార్ దర్శకత్వంలో వచ్చిన 24 కిసెస్ చాలా మైనస్ అయింది. శృతి మించిన ముద్దులతో రెచ్చిపోయింది. అదే జనాలకి అంతగా నచ్చలేదు. సందర్భం లేకుండా ముద్దులను పెట్టుకోవడం నచ్చలేదు. అలా హెబ్బా జనాల దృష్ఠిలో నెగిటివ్‌గా మారింది. దాంతో హీరోయిన్గా అవకాశాలు అందుకోలేకపోయింది. ఫిజిక్‌లో వచ్చిన మార్పులు కూడా బాగా మైనస్ అయ్యాయి. దాంతో ఐటెంస్ సాంగ్ కి తీసుకున్నారు.
రెడ్ సినిమాలో అందాల బోతతో మోత మోగించింది. కానీ, అలా ఐటెం సాంగ్ చేసినా హెబ్బాని పట్టించుకోలేదు. కనీసం ఐటెంస్ సాంగ్స్‌తో అయినా నెట్టుకొస్తుందీ అనుకుంటే దానికి కూడా పనికిరాదని తేల్చేశారు. అలా ఇప్పుడున్న యంగ్ బ్యూటీస్ దెబ్బకి హెబ్బా ఓ మూలన పడింది. మళ్ళీ అవకాశాల కోసం ఫొటో షూట్స్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.