Moviesఆరోజు ఆ ఒక్క పని చేసుంటే..నా సాగర్ హ్యాపీ గా నాతోనే...

ఆరోజు ఆ ఒక్క పని చేసుంటే..నా సాగర్ హ్యాపీ గా నాతోనే ఉండేవాడు..సంచలన విషయాని బయటపెట్టిన మీనా ..!

టైం..చాలా ముఖ్యమైనది. ఒక్కసారిపోతే..మళ్లీ తిరిగిరాదు. ఎంత గొప్పవాడి కైనా..రోడు పక్కన పొడుకుని బ్రతికేవాడికైన టైం ఒక్కటే. సెకండ్ లొనే ప్రాణంపోతుంది..ఆ సెకండ్ లోనే జరగరాని ఘోరాలు జరిగిపోతాయి. అందుకే మన పెద్ద వాళ్లు చెప్పుతుంటారు. ఏ పని చేసినా ఆలోచించి చేయండి అని..ఒక్కసారి చేజారిపోతే.. మనం ఏం చేయాలేం..ఇప్పుడు అదే పోజీషన్ ని అనుభవిస్తుంది..సీనియర్ హీరోయిన్ మీనా.

మనకు తెలిసిందే హీరోయిన్ గా మీనా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకతేష్..ఇలా బిగ్ స్టార్ అందరి సినిమాలో నటించి..మంచి మంచి హిట్స్ అందుకుని కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సాఫ్ట్ వేర్ ఉద్యోగి విద్యా సాగర్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసి..మళ్ళీ మంచి మంచి అవకాశాలు అందుకుంటున్నా..మీనా జీవితాని తలకిందులు చేసేశాడు ఆ దేవుడు.

కొద్దిరోజుల క్రితమే మీనా భర్త విద్యాసాగర్ మరణించాడు. ఆయన ఊపిరితిత్తులు బాగోలేక చనిపోయాడని డాక్టర్లు ధృవికరించారు. భర్త మరణం తర్వాత కుమిలిపోయిన మీనా..రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ అందరిని కలిచివేస్తుంది. “అవయవాదానం ఎంత గొప్పదో చాలా మందికి తెల్సీనా ముందుకు రావడం లేదు..మనం మరణీంచిన తరువాత కూడా..మన అవయవాలు వేరే వాళ్ళకిపనికివస్తాయి. తద్వారా వాళ్ళి ఇంకొన్ని ఎక్కువ రోజులు బ్రతుకుతారు. అందుకే నా అవయవాలు దానం చేస్తున్నా..మీరు చేయండి.. ఆ రోజు నా భర్తకు ఎవ్వరైనా ఊపిరితిత్తులు దానం చేసుంటే..ఈ రోజు నా సాగర్ నాతోనే ఉండేవాడు. నా పక్కనే హ్యాపీగా ఉండేవాడు “అంటూ ఎమోషనల్ నోట్ పెట్టింది మీనా.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news