యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి ? కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడితో ? చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది.
ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా చేయాలని బాలయ్య అనుకున్నారు. అయితే ఆ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ డేట్లు ఇవ్వలేకపోయారు. దీంతో చివరకు క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణికే బాలయ్య ఓటేశారు. ఆంధ్ర దేశాన్ని పాలించిన 17వ శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మరో విశేషం ఏంటంటే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కు పోటీగా రిలీజ్ అయ్యి మరి శాతకర్ణి హిట్ అయింది.
ఆ సంక్రాంతికి యువ హీరో శర్వానంద్ శతమానం భవతి కూడా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా మహారాణి పాత్రలో శ్రీయ నటించింది. బాలయ్య – శ్రియ కాంబినేషన్ హిట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి – గౌతమీపుత్ర శాతకర్ణి – పైసా వసూల్ సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నయనతార పేరు వినిపించింది ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో క్రిష్ ఎలాగైనా అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు.
తాను దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అనుష్క తన నటనతో ప్రేక్షకులను మైమరిపింపజేసింది. అందుకే ఎలాగైనా అనుష్క ఒప్పించి బాలయ్యకి జోడిగా నటింపజేయాలని అనుకున్నారు. అనుష్క కూడా బాహుబలి 2 – సైజ్ జీరో సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది. దీంతో ఈ అవకాశం శ్రీయకు దక్కింది.
ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర అయినా గౌతమీ బాలాశ్రీ పాత్రకు ప్రముఖ హిందీ నటి హేమమాలినిని తీసుకున్నారు. అంతకు ముందు బాలయ్య – అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఒక్కమగాడు డిజాస్టర్ అయింది. చివరకు శాతకర్ణి లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం అనుష్క మిస్ చేసుకుంది. ఇక ఆ తర్వాత బాలయ్యతో నటించే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. కానీ శాతకర్ణి చేసి ఉంటే అనుష్కకు సీనియర్ హీరోలతో మంచి ఛాన్సులే వచ్చేవి.