గత కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం యంగ్ హీరో నితిన్ వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్స్ కు పోటీ ఇచ్చే ఈ హీరో ప్రజెంట్ వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ ని నిలబెట్టుకోవడానికి నితిన్ నానా తిప్పలు పడుతున్నాడు. మా అన్న ఒక్క హిట్ కొడితే చూడాలి అంటూ నితిన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ల ఆకలి తీర్చేసాడు నితిన్ మాచర్ల నియోజకవర్గం తో అంటున్నారు అభిమానులు.
ఇప్పటి వరకు చేయని ఢిఫరెంట్ కాన్ సెప్ట్ తో నితిన్ జనాల ముందుకు వచ్చాడు. ప్రతి సినిమాలో యంగ్ లవర్ బాయ్ గా కనిపించే ఈయన ఈ సినిమాలో ఈఆశ్ ఆఫిసర్ గా దర్శనమిచ్చాడు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్ తో సందడి చేసే నితిన్… ఈసారి కంప్లీట్ గా తన జానర్ మార్చేసి.. కంప్లీట్ యాక్షన్ రోల్‌ను పోషించాడు. దీంతో అభిమానులకు మాస్ జాతర అయ్యింది. ఇక ఇప్పటికే ప్రీమియర్ షోష్ పడగా.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఈ సినిమా మొత్తం నేటి రాజకీయ పరిస్ధితుల ఆధారంగా తెర కెక్కిన్నట్లు సినిమా చూసిన జనాలు చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ సినిమా అయినా డైరెక్టర్ రాజశేఖర్ ..ఎక్కడ బోర్ కొట్టించకుండా నితిన్ ని తన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో..అలా మార్చేసి..అభిమానులకు దగ్గరైయేలా చేసాడు. ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కృతి శెట్టి అందాలు. తెర పై అమ్మడు హాట్ అందాల డోస్ కుర్రాళ్ళను ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అంటున్నారు జనాలు. టోటల్ గా రాజకీయ నేపధ్యంలో సాగిన ఓ మాస్ ఎంటర్ టైన్ మెంట్ ..అంటూ జనాలు రివ్యూ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో నితిన్ బ్లాక్ బస్టర్ వేసుకున్నట్లే అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. మరి చూడాలి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..!?