గతేడాది నుండి టాలీవుడ్‌లో సమంత నాగచైతన్య విడాకుల వార్త ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. మొదట్లో విడాకుల వార్తలు వచ్చినప్పుడు అంతా ఉత్తుత్తి వార్తలే అనుకున్నారు. కానీ డిసెంబర్‌లో ఈ జంట విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. మొదట్లో విడాకులకు కారణం ఆమె డిజైనర్ ప్రీతం అంటూ వార్తలు వచ్చాయి. డిజైనర్ ప్రీతం తో సమంతకు లవ్ ఎఫైర్ ఉందని ఆ రిలేషన్ షిప్ గురించి చైతూకు తెలిసి విడాకులు తీసుకున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ప్రీతమ్ నాకు సమంత అక్క లాంటింది అంటూ ఆ వార్తలకు చెక్ పెట్టారు. ఆ తరవాత సమంత కు పిల్లలను కనటం ఇష్టం లేదు అంటూ కూడా టాక్ వినిపించింది.
ఇదిలా ఉండగా చైతూ కూడా ఏం తక్కువోడు కాదని అతడికి హీరోయిన్ లతో ఉన్న ఎఫైర్ ల వల్లే సమంత విడాకులు ఇచ్చిందని సామ్ అభిమానులు ఫైర్ అయ్యారు. విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత సోషల్ మీడియాలో ఏదో ఒకమాటతో చైతును రెచ్చగెట్టేందుకే ట్రై చేసిందని అనిపించింది. ఇక తాజాగా చైతు కూడా సమంత గురించి ఎదురైన ప్రశ్నలకు చాలా స్మూత్‌గానే ఆన్సర్ చేశాడు. ఇక ఇప్పుడు సమంత – నాగచైతన్య గురించి నెట్టింట మరో వార్త వైరల్ అవుతోంది.
పెళ్లికి ముందే నాగచైతన్య ఓ హీరోయిన్‌తో లవ్ ఎఫైర్ నడిపించారట. అంతే కాకుండా సమంతతో ప్రేమాయణం నడిపిస్తున్న సమయంలోనే ఆ హీరోయిన్ ను కూడా ప్రేమించాడట. ఆ హీరోయిన్ మరెవరో కాదు కమల్ హాసన్ కుమార్తె స్టార్ హీరోయిన్ శృతి హాసన్. వీరిద్దరూ కలిసి తెలుగు ప్రేమమ్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ 2017 సమయంలో జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు అనేది టాక్.
అంతే కాకుండా కొంత కాలం వరకూ డేటింగ్ లో ఉన్నారని కూడా వార్తలు వినిపించాయి. ఇంతలో ఏమైందో ఏమో గానీ ఇద్దరూ విడిపోయారట. ఆ తరవాత అదే ఏడాది నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్నారు. ఆ మాటకు వస్తే సమంతకు కూడా పెళ్లికి ముందే సిద్ధార్థ్ లాంటి హీరోలతో ఎఫైర్లు ఉన్నాయన్న ప్రచారం ఉంది. ఇక చైతూ విడాకుల తరవాత కూడా హీరోయిన్ శోభితతో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరూ ఓకే ఫ్లాట్ లో ఉన్నారని కూడా టాక్ వినిపించింది. కానీ చైతూ ఆ వార్తల్ని ఖండించాడు.