మన టాలీవుడ్ లో హీరోలు ఎక్కువమంది అయిపోయారు. దీనికి తోడు వారసుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో హీరోయిన్ల కొరత వేధిస్తోంది. ఒకే హీరో ఒకే హీరోయిన్‌తో మూడు నాలుగు సినిమాల్లో కూడా రిపీట్ అవుతున్న పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు శ్రీదేవి లాంటి క్రేజీ హీరోయిన్లతో తండ్రి ఏఎన్నార్.. కొడుకు నాగార్జున కూడా జోడి కట్టారు. ఇక ఇప్పుడు కూడా అక్కినేని వంశంలో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు అటు నాగార్జున ఇటు నాగచైతన్య ఇద్దరితోనూ రొమాన్స్ చేశారు. అలాగే నందమూరి హీరోలు అయిన బాబాయ్ బాలకృష్ణ – అబ్బాయి ఎన్టీఆర్ ఇద్దరితో రొమాన్స్ చేసిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. ఆ హీరోయిన్ల లిస్ట్… ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
ఆర్తీ అగర్వాల్ :
20 ఏళ్ల క్రితం టాలీవుడ్‌ను తన అంద చందాలతో ఊపేసిన ఆర్తీ అగర్వాల్ ముందు ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసింది. ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు సినిమా చేసిన ఆమె బాలయ్యతో పలనాటి బ్రహ్మనాయుడులో నటించింది. అబ్బాయ్ సినిమా హిట్ అయితే బాబాయ్ సినిమా ఫట్ అయ్యింది.
సదా :
సదా ఎన్టీఆర్‌కు జోడీగా నాగ సినిమాలో నటించింది. ఇటు బాలయ్యతో వీరభద్ర సినిమాలో జోడీ కట్టింది. ఈ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యయి.
భూమిక :
భూమిక ఎన్టీఆర్ పక్కన సింహాద్రి, సాంబ సినిమాలు చేసింది. సింహాద్రి ఇండస్ట్రీ హిట్.. సాంబ యావరేజ్. భూమిక బాలయ్యకు జోడీగా కాకపోయినా ఆయన రూలర్ సినిమాలో చేయగా అది ప్లాప్ అయ్యింది.
అంకిత :
అంకిత ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సింహాద్రి సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యతో స్వర్ణ సుబ్బారావు తెరకెక్కించిన విజయేంద్రవర్మ డిజాస్టర్ అయ్యింది.
శ్రీయ :
శ్రీయ ఎన్టీఆర్‌కు జోడీగా నా అల్లుడు సినిమా చేస్తే ప్లాప్ అయ్యింది. అదే బాలయ్యకు జోడీగా ఆమె చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు చేసింది. ఈ సినిమాలతో ఆమెకు మంచి పేరే వచ్చింది.
ఛార్మీ :
ఛార్మీ కౌర్ బాలయ్యకు జోడీగా అల్లరి పిడుగు సినిమా చేయగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది. రాఖీలో ఎన్టీఆర్‌కు జోడీ కట్టగా ఆ సినిమా హిట్ అయ్యింది.
ప్రియమణి :
ప్రియమణి ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో నటించింది. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడు. ఇక బాలయ్యకు జోడీగా మిత్రుడు సినిమాలో నటించగా.. మిత్రుడు ప్లాప్ అయ్యింది. మిత్రుడు కథా పరంగా బాగున్నా బాలయ్య ఇమేజ్‌కు సూట్ కాలేదు.
షీలా :
షీలా ఎన్టీఆర్‌తో అదుర్స్ సినిమా చేసింది. అదుర్స్ కామెడీ పరంగా మంచి హిట్ అయ్యింది. ఇక బాలయ్యకు జోడీగా పరమవీరచక్ర సినిమా చేస్తే అది డిజాస్టర్ అయ్యింది.
అమీషా పటేల్:
అమీషా పటేల్ అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ ఇద్దరికి కలిసి రాలేదు. ఎన్టీఆర్‌తో చేసిన నరసింహుడు, బాలయ్యతో చేసిన పరమవీరచక్ర రెండూ ప్లాప్ అయ్యాయి.
నయనతార :
నయనతార ఎన్టీఆర్‌తో అదుర్స్ చేసి హిట్ కొట్టింది. అటు బాలయ్యతో జైసింహా, శ్రీరామరాజ్యం, సింహా లాంటి హిట్ సినిమాలు చేసింది. ఏదేమైనా నయనతార బాబాయ్, అబ్బాయ్ ఇద్దరికి బాగా కలిసొచ్చింది.
త్రిష :
త్రిష ఎన్టీఆర్ పక్కన దమ్ము సినిమా చేసింది. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక బాలయ్యకు జోడీగా లయన్ చేస్తే ప్లాప్ అయ్యింది.
శృతీహాసన్ :
శృతీహాసన్ ఎన్టీఆర్ పక్కన రామయ్యా వస్తావయ్యా సినిమా చేసింది. ఆ సినిమా బిలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఇప్పుడు బాలయ్య 107 సినిమాలో నటిస్తోంది.