Moviesభర్త చనిపోయాక ఫస్ట్ టైం అలా..మీనా చేసిన పనికి అంతా షాక్..!!

భర్త చనిపోయాక ఫస్ట్ టైం అలా..మీనా చేసిన పనికి అంతా షాక్..!!

సౌత్ ఇండియాలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా..మీనా రూటే వేరు. ఒకప్పుడు తన అందచందాలతో అలరించిన ఈమె..ఇప్పుడి స్ సీనియర్ హీరోయిన్ గా వచ్చిన సినిమాలల్లో నచ్చిన పాత్రలు చేస్తుంది. కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే మీనా కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇటీవలే మీనా భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే.

అంతకముందు కరోనా సోకి..ఆరోగ్యం బాగోలేక..చిన్న వయసులోనే మృతిచెందారు. ఆ టైంలో మీనా ని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. అప్పటినుంచి మీనా కుటుంబం పుట్టడు దుఃఖం లో మునిగిపోయారు. భర్త మృతదేహాని పట్టుకుని..ఆమె కుమిలిపోయిన దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు. పగవాడికి కూడా ఇలాంటి పరిస్ధితి రాకూడదు అనుకున్నారు.

ఆయన మరణం ఆమె కుటుంబానికి తీరని లోటుగా మిగిలిపోయింది. ఇలాంటి టైంలోనే ఫ్రెండ్స్ మనకు సహాయంగా నిలుస్తారు. రీసెంట్ గా మీనా కుటుంబాన్ని పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ ,సంగీత, సంఘవి వారి ఫ్యామిలీలతో కలిసి మీనా ఇంటికి వెళ్లి..ఆమెను పరామర్శించారు. వీళ్ళి హీరోయిన్స్ గా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుకున్న..మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్త మరణించాక మీనా పెట్టిన తొలి పోస్ట్ ఇది. ఈ ఫోటోలో మీనా నవ్వుతూ కనిపించింది. అభిమానులు మీనా మొహంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. కొందరు నెగిటివ్ ట్రోలర్స్ అయితే, భర్త మరణించి కొద్ది కాలం కూడా అవ్వలేదు అప్పుడే షూటింగ్ అంటూ తిరుగుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news