ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లు తెలుగులో సినిమాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ భామల చూపంతా టాలీవుడ్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తున్న సినిమాలు పాన్ ఇండియాను షేక్ చేస్తున్నాయి. అసలు పాన్ ఇండియా అనే పదాన్ని తీసుకువచ్చిందే టాలీవుడ్ మేకర్స్. మన టాలీవుడ్ హీరోలు, దర్శకులతో పనిచేసి ఒక్క పాన్ ఇండియా హిట్ కొడితే ఆ హీరోయిన్ల రేంజే మారిపోతోంది. దీంతో పాటు కావాల్సినంత క్రేజ్, అటు రెమ్యునరేషన్లు, మర్యాదలు ఇవన్నీ బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ వెంట పడేందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
మొదట బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ కియారా అద్వానీ. ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. చూడడానికి ఫారెన్ బ్యూటీలా తెల్లగా కనిపిస్తున్న ఈ బ్యూటీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
భరత్ సినిమాలో కియారా మహేష్ పక్కన చూడచక్కని జంటగా సెట్ అయ్యింది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విదేయ రామ సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు.
ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా కియారా అద్వాని బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమాయణం నడిపి వార్తల్లోకి ఎక్కింది. అంతేకాకుండా వీరిద్దరూ ప్రస్తుతం చట్టాపట్టాలేసుకుని బాగా ఎంజాయ్ చేశారు. వీరు సీక్రెట్‌గా కాపురం కూడా పెట్టేశారు అనుకుంటోన్న టైంలో బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు అందరికి షాక్ ఇచ్చాయి. ఇటీవల కియార తన 30వ పుట్టినరోజును జరుపుకుంది. కియారా బర్త్ డే పార్టీ దుబాయ్ లో గ్రాండ్ గా జరుపుకుంది.
ఈ పార్టీలో కియారాతో పాటు సిద్ధార్థ మల్హోత్రా కూడా ఉన్నట్టు వార్తలు వినిపించినా సిద్ధార్థ్ మల్హోత్రా కియారాతో ఉన్నట్టు ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు ఇటీవల టైగర్ బ్యూటీ అనన్య పాండే కూడా వీరిద్దరి రిలేషన్ షిప్ పై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి రిలేషన్షిప్ ప్రస్తుతం కంటిన్యూ అవుతుందా ? లేదా ? అన్నది మాత్రం క్లారిటీ లేదు. వీరిలో ఒకరు నోరు విప్పితే తప్పా ఈ సస్పెన్స్‌కు ఇప్పట్లో తెరపడేలా లేదు.