ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మహానటి కీర్తి సురేష్ ఒకరు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటూ కీర్తి తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా తరవాత కీర్తి వరుస ఆఫర్లు అందుకుంది. నిజానికి కీర్తి తమిళ్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేసింది. ఆ తరవాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాతో ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో చూస్తే కీర్తి నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలేమో.
ఈ సినిమా తరవతనే కీర్తి సురేష్ అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకుంది. దివంగత మహానటి సావిత్రి నిజ జీవిత పాత్రలో అచ్చుగుద్దినట్టు కీర్తి జీవించడంతో అసలు అందరూ మెస్మరైజ్ అయిపోయారు. అంతే కాకుండా కీర్తి సురేష్ చాలా మంది హీరోయిన్ ల మాదిరిగా కాకుండా గ్లామర్ షోకు పూర్తిగా దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలోనే నటిస్తోంది. మహానటి తరవాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలోనే నటించింది. కానీ అవి బెడిసి కొట్టడంతో రూటు మార్చుకుంది.
ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటించి అందచందాలతో ఆకట్టుకుంది. కాస్త గ్లాయర్ డోస్ పెంచడంతో పాటు అందాలు చూపించే విషయంలో గేట్లు ఎత్తేసింది. ఇదిలా ఉండగా అప్పట్లో కీర్తి సురేష్ ఓ తమిళ కమెడియన్ తో లవ్ ఎఫైర్ నడిపిస్తోందంటూ వార్తలు వినిపించాయి. తమిళ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ కమెడియన్ కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో సహాయపడ్డాడట. దాంతో కీర్తి కూడా అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టిందట.
ఆ తరవాత ఇద్దరిమధ్య ప్రేమ చిగురించిందని టాక్ వినిపించింది. వీరిద్దరూ కలిసి కూడా చాలా సార్లు మీడియాకు చిక్కారు. ఆ కమెడియన్ మరెవరో కాదు తమిళ కమెడియన్ సతీష్ తో కీర్తి ప్రేమలో ఉందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై కీర్తి మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. మరోవైపు సంగీత దర్శకుడు అనిరుధ్ తో కూడా కీర్తి లవ్ ఎఫైర్ నడిపిస్తోందంటూ వార్తలు వినిపించాయి. కానీ అతడు జస్ట్ ఫ్రెండ్ అంటూ కీర్తి క్లారిటీ ఇచ్చింది.