తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు నిర్మాతలకు స్టార్ హీరోలకు మధ్య వార్ జరుగుతుంది. సినిమా బడ్జెట్ కంటే హీరోల పారితోషకాలు భారీగా పెంచేస్తున్నారు. దీంతో సినిమా కాస్ట్ కట్టింగ్ చేయాల్సిందే అంటూ నిర్మాతలకు లు సమ్మె చేస్తునారు. సినిమా నిర్మాణ విలువలు కంటే హీరోల పారితోషకాలే ఎక్కువుగా ఉన్నాయని,, దాదాపు బడ్జేట్‌లో సగానికి సగం వీరికే వెళ్ళిపోతుందని.. నిర్మాతలకు లు వాపోతున్నారు. సినిమా మేకింగ్‌కు ఎంత ఖర్చు అయిన హీరోలు మాత్రం 50 కోట్లు నుంచి 100 కోట్లు పారితోష్కం ఇవ్వాలి అని ఇబ్బంది పెడుతున్నారని పరోక్షంగా లిమిట్స్ క్రాస్ చేసి పారితోషకం తీసుకుంటున్న హీరో ల పై ఫైర్ అవుతున్నారు.
ఇప్పుడు ఉన్న కుర్ర హీరోలు కూడా పారితోషకాలు భారీగా పెంచేసారనే టాక్ మొదలైంది. ఇదే సమయంలో మన ఆగ్ర హీరోల పారితోషకాల మ్యాటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. స్టార్ హీరోలల్లో అత్యధికంగా పారితోషకం తీసుకునేవారి లిస్ట్ ఇప్పుడు అస్తికరంగా మారింది. భారత దేశంలోనే మొదటిసారిగా కోటి పారితోషకం తీసుకున్న హీరోలు ఎవరు అంటే మనం బాలీవుడ్ హీరోలు అనుకుంటాం. కానీ, తెలుగులో ఆగ్రహీరోలలో ఒకరు అయిన మోగాస్టర్ చిరంజీవి అప్పటిలోనే కోటి రూపాయలు పారితోషకంగా అందుకున్నాడు. ఈ విషయం ఇండియా టూడే లో వచ్చింది. అలాంటిది ఇప్పుడు చిరంజీవి ఎంత పారితోషీకం తీసుకుంటున్నారు అనే విషయనికి వస్తే అయన ఒకో సినిమాకు ప్రస్తుతం రూ. 25 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది.
పవన్ కల్యాణ్ 50 కోట్లు, మహేశ్ బాబు 60 కోట్లు, తారక్ 70 కోట్లు, చరణ్ 70 కోట్లు..అల్లు అర్జున్ ప్రభాస్ అయితే 100 కోట్లు దాటేసి 120 కోట్లు అందుకుంటున్నారట. అందరు హీరోలు వందల కోట్లు తీసుకున్ని దూసుకు పొతుంటే బాలయ్య మాత్రం సినిమాకి 30-40 కోట్లు పారితోషకం తీసుకుని నిర్మాతలని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటున్నాడు. కొందరు హీరోలుఇ రెమ్యూనరేషన్ నే కాకుండా దానితో పాటు సినిమా కు వచ్చిన లాభలు కొంత తీసుకుంటునారు. యంగ్ హీరోల తో పోళిస్తే,, సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేష్ లాంటి వారే సినిమా బడ్జెట్ కి తగ్గ రేంజ్ లో పారితోషకం తీసుకుంటూ..ఇండస్ట్రీని నష్టాలోకి పోకుండా కాపాడుతున్నారు అంటున్నారు సినీ విశ్లేషకులు.