Moviesస్టార్ హీరో విడాకులు..చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన భార్య..!?

స్టార్ హీరో విడాకులు..చెప్పుతో కొట్టే ఆన్సర్ ఇచ్చిన భార్య..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువుగా వినిపిస్తున్న పదం డివర్స్..విడాకులు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ..బిగ్ బిగ్ స్టార్స్ కూడా దాంపత్య జీవితాని బ్యాలెన్స్ చేయలేక విడాకులు తీసుకుంటున్నారు. సమంత, నాగ చైతన్య, అమీర్ ఖాన్, ధనుష్, శ్రీజ, ఇలా బిగ్ సెలబ్రిటీలంతా విడాకులు తీసుకొవడానికి సిద్ధపడుతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఓ స్టార్ హీరో కూడా డివర్స్ తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

దగ్గుబాటి హీరో రానా కూడా తన భార్యకి డివర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడని వార్తలు తెగ హల్ చల్ చేసాయి. వాళ్ళ మధ్య ఏవో గొడవలు అని..అందుకే డివర్స్ తీసుకోబోతున్నారని పుకార్లు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్లే రానా సోషల్ మీడియాకి దూరం అవుతున్నా అని చెప్పడం..పాత పోస్ట్లను డిలిట్ చేయడంతో..అందరు ఆ వార్తలు నిజమే అనుకున్నారు. దీంతో చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు కూడా. కానీ, రీసెంట్ గా వాళ్లకి పగిలిపోయే ఆన్సర్ ఇచ్చింది రానా భార్య మిహికా.

డివర్స్ వార్తలకి చెక్ పెడుతూ తాజాగా రానా భార్య మిహికా ..సెకండ్‌ ఆనివర్సరీ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.ఈ సందర్భంగా భర్తతో కలిసి దిగిన కొన్ని బ్యూటిఫుల్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో రానా-మిహికాల విడాకులు అన్న వారికి మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చిన్నత్లైంది. విడాకులు లేవు..అని మిహికా చెప్పకనే చెప్పేసింది.

 

దీంతో మిహికా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక మిహికా పోస్ట్‌ చూసి వెంకటేశ్‌ కూతురు ఆశ్రితతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ కపుల్స్‌కి ఆనివర్సరీ విషెస్‌ను తెలుపుతూ కామెంట్స్‌ చేస్తున్నారు. త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి అంటూ ఆటపట్టిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Miheeka Daggubati (@miheeka)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news