ఎట్టకేలకు నందమూరి కళ్యాణ్‌రామ్‌కు బింబిసారా సినిమాతో హిట్ వచ్చింది. 2015లో వచ్చిన పటాస్ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 118 సినిమాతో కళ్యాణ్ మరో హిట్ కొట్టాడు. అయితే ఎట్టకేలకు ఇది కళ్యాణ్‌రామ్ సినిమా అని గొప్పగా చెప్పుకునేంత టాక్ బింబిసారకు వచ్చింది. లాంగ్ రన్‌లో బింబిసార కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇక బింబిసార పాత్ర కళ్యాణ్‌రామ్ మినహా ఇంకెవ్వరూ చేయలేరని కూడా ఎన్టీఆర్ రిలీజ్‌కు ముందే చెప్పారు.
నిజంగా సినిమాలో కళ్యాణ్‌రామ్ నట విశ్వరూపం చూస్తే ఎన్టీఆర్ చెప్పింది అక్షరాలా నిజం అనిపించింది. కొత్త దర్శకుడు అయినా మల్లిడి వశిష్ట్ బింబిసారను సోషియో ఫాంటసీ, చారిత్రాత్మక కథకు లింక్ పెట్టిన తీరు అద్భుతం. అయితే ఈ సినిమా బాలయ్య చేసి ఉంటే మరోలా ఉండేది. ఇదే కథను బాలయ్యతో తీస్తే ఎలా ? ఉంటుందన్న చర్చ కూడా నడిచిందట.
అయితే ఫస్టాఫ్‌లో బింబిసారుడి పాత్ర క్రూరమైన రాజుగా ఉంటుంది. తనకు అడ్డు వచ్చిన పిల్లలు, వృద్ధులను కూడా చంపాల్సి ఉంటుంది. అది బాలయ్యకు యాప్ట్ కాదేమో అని చివరకు కళ్యాణ్‌రామ్‌తోనే ఈ ప్రాజెక్ట్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఒకవేళ థమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టి, బాలయ్యను పెట్టి ఉంటే బింబిసార ఖచ్చితంగా అఖండను మించిన అఖండ అయ్యి ఉండేది.
ఏదేమైనా ఇటు నెగటివ్ రాజు కోణంలో చూసినప్పుడు బింబిసారుడి పాత్ర, చిత్రీకరణ చాలా కొత్తగా ఉంది. కళ్యాణ్‌రామ్ దీనికి ఒప్పుకోవడం… దర్శకుడు వశిష్ట్ డీల్ చేయడం బాగుందనే చెప్పాలి. విలన్ వేరు, హీరో వేరు అన్నట్టుగా కాకుండా.. ముందు రెండు పాత్రలు కళ్యాణ్‌రామ్ చేయడం… చివర్లో ఆ నెగిటివ్ రోల్ చేసిన రాజు పాత్ర మంచిగా మారడం.. అసలు విలన్లు వేరుగా ఉండడం ఇవన్నీ కొత్తగా ఉండి ప్రేక్షకులను మెప్పించాయి. ఇక బింబిసార ఫస్ట్ డే ఏకంగా రు. 6.5 కోట్ల షేర్‌తో కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఆల్ టైం రికార్డుగా నిలిచింది.