తమిళ హీరో విశాల్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. నిజానికి విశాల్ తెలుగు వాడే అయినా చెన్నైలోనే స్థిరపడటంతో కోలీవుడ్ హీరోగా ముద్రపడిపోయింది. విశాల్ స్వస్థలం నెల్లూరు జిల్లా. విశాల్ తండ్రి పారిశ్రామికవేత్త. ఆయన వ్యాపారాల వల్ల చెన్నైలో స్థిరపడడంతో విశాల్ అక్కడ సెటిల్ అయిపోయాడు. తమిళ్‌లో సినిమాలు చేస్తున్నా విశాల్ క్రమం తప్పకుండా తన సినిమాలను తెలుగులోనూ డబ్ చేస్తూ ఆడియన్స్‌కు దగ్గరవుతున్నాడు. పందెం కోడి సినిమాతో విశాల్ తెలుగు ప్రేక్షకులను సైతం తనవైపు తిప్పుకున్నాడు. చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ అమ్మాయిల మనసు దోచుకున్నాడు.
ఇదిలా ఉండగా విశాల్ ప్రముఖ నుటుడు శరత్ కుమార్ ముద్దుల కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్‌తో కొంత కాలం ప్రేమాయణం నడిపాడు. వీరిద్దరూ కలిసి మొట్టమొదటిసారి మరగదరాజ సినిమాలో నటించారు. అప్పటి నుండే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని కోలీవుడ్ లో టాక్ వినిపించింది. ఎక్కడ చూసినా వీళ్లిద్దరే చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. అంతే కాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ వార్తల పై వీరిద్దరూ స్పందించలేదు.
అయితే విశాల్ – శరత్ కుమార్ మధ్య గొడవల నేపథ్యంలోనే వీరిద్దరూ విడిపోయారనే అంటారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ – శరత్‌కుమార్ కత్తులు దూసుకున్నారు. వీరి మధ్య మాటల తూటాలు పేలాయి. చివరకు ఆ ఎన్నికల్లో శరత్‌కుమార్ వర్గం ఓడిపోయి.. విశాల్ వర్గం గెలిచింది. ఇది జరిగిన చాలా కాలానికి విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ మళ్లీ కలిసి పందెం కోడి 2 సినిమాలో నటించారు. పందెం కోడి 2లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా… మరో హీరోయిన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్ కు ఎక్కువగా వరలక్ష్మి గురించే ప్రశ్నలు మొదలయ్యాయి. దాంతో తనకు వరలక్ష్మి మంచి ఫ్రెండ్ అని అంతకు మించి ఏమీ లేదని చెప్పాడు. వరలక్ష్మి అయితే ఓ ఇంటర్వ్యూలో ఏకంగా దండం పెడతా నాకు విశాల్ కు మధ్యన ఏమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విశాల్ వరలక్ష్మిని కాకుండా మరో హీరోయన్ తో ప్రేమలో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే విశాల్ నోరు విప్పాల్సిందే.