Moviesసీతారామం రిజల్ట్: డైరెక్టర్ ను గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చేసిన...

సీతారామం రిజల్ట్: డైరెక్టర్ ను గట్టిగా పట్టుకుని బోరున ఏడ్చేసిన హీరోయిన్..!!

ఈ రోజు బాక్స్ ఆఫిస్ వద్ద పండగ వాతావరణం నెలకోంది. నేడు రెండు బడా సినిమాలు ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సందడి చేశాయి. ఒకటి కళ్యాణ్ రామ్ బింబిసారా..మరోఈకటి దుల్కర్ సల్మాన్ “సీతారామం”. రెండు కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మంది విజయాలు అందుకున్నాయి. ఒక సినిమా టై ట్రావెల్ కధతో ముందుకెళ్లి మెప్పిస్తే మరోకటి..స్వఛ్చమైన ప్రేమకు అర్ధం చెప్పుతూ..జనాల మనసు దోచ్చింది. అయితే, సీతారామ కన్నా కూడా బింబిసారనే ఎక్కువ మార్కులు కొట్టేసింది.

కాగా, సీతారామం సినిమా చాలా మంది లవర్స్ కు కనెక్ట్ అయ్యింది. ప్రేమ లోని ఓరిజినాలిటీని చూపించడంలో డైరెక్టర్ హను రాఘవపూడి సక్సెస్ అయ్యాడు. కానీ సినిమా కొంచెం స్లోగా సాగుతుందని తప్పిస్తే మిగతావన్ని కూడా క్లీన్ గా ముందుకు తీసుకెళ్ళారు. ముఖ్యంగా లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, మృణాళి ఠాకూర్ మధ్య రొమాన్స్ కెమిస్ట్రీ బాగా పండాయి.దర్శకుడు హను రాఘవపూడి సీతారామం మూవీతో మ్యాజిక్ చేశారు. క్రిటిక్స్ ఈ మూవీని ఓ అద్భుతమైన క్లాసిక్ లవ్ స్టోరీగా అభివర్ణిస్తున్నారు. ప్రేక్షకులు సైతం సీతారామం మూవీ గొప్పగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

కాగా సీతారామం మూవీ టీం సభ్యులు అందరు..ఈ సినిమా ను హైదరాబాద్ లో ప్రేక్షకుల మధ్య చూశారు. తెర పై బొమ్మ పడగానే అభిమానుల కేకలు అరుపులు..రచ్చ మామూలుగా లేదు. ఓ స్టార్ హీరో కి ఇచ్చిన గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు ఈ మలయాళీ హీరోకి. సినిమా చూసిన తరువాత బయటకు వచ్చిన హీరోయిన్ మృణాళి ఠాకూర్..డైరెక్టర్ ను గట్టిగా హద్దుకునేసి..ఏడ్చేసింది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతోనే ఆ ఆనందం తట్టుకోలేక ఇలా కన్నీరు పెట్టుకునింది. ఓ అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు ఆమె దర్శకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news