ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉంటూ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు ఆర్కే రోజా. ఆమె సినీ నేపథ్యం నుంచి రాజకీయాలకు వచ్చి సక్సెస్ అయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీలత రెడ్డి 198ం వదశలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రముఖ దివంగత సినీ నటులు, మాజీ ఎంపీ శివప్రసాద్ శ్రీలత రెడ్డి పేరును కాస్త రోజాగా మార్చేశారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా రోజా నటించారు. అప్పట్లో గ్లామర్ పాత్రలకు రోజా కేర్ ఆఫ్ అడ్రస్.
తమిళ సినిమాల్లో నటిస్తున్న సమయంలో తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని రోజా ప్రేమ వివాహం చేసుకున్నారు. సినిమాలకు దూరమయ్యాక రోజా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి జబర్దస్త్ జడ్జిగా దుమ్ము దులిపేస్తున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. జబర్దస్త్ కామెడీ కార్యక్రమానికి 9 సంవత్సరాల పాటు కంటిన్యూగా జడ్జిగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు.
దక్షిణ భారతదేశ రాజకీయాల్లో జయలలిత తర్వాత సినిమా రంగం నుంచి వచ్చి ఆ రేంజ్ లో చక్రం తిప్పిన మహిళ రోజా మాత్రమే. తన కెరీర్‌లో ఎన్నో గ్లామర్ పాత్రలలో నటించిన రోజా ఒక ఐటమ్ సాంగ్ లో కూడా నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా బాలీవుడ్ సినిమాలో కావటం విశేషం. మూడు దశాబ్దాల క్రిందట చిరంజీవి హీరోగా అల్లు అరవింద్ నిర్మాతగా ది జెంటిల్మెన్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో రోజా ఐటెం సాంగ్ లో మెరిసింది. అప్పట్లో ఈ పాటతో రోజా తన అందచందాలతో బాలీవుడ్‌ను ఊపేసింది.
ప్రస్తుత బాలీవుడ్ కుర్ర హీరోయిన్ అలియా భట్ తండ్రి మహేష్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సౌత్ లో వచ్చిన జెంటిల్మెన్ సినిమాను హిందీలో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. తెలుగులో ప్రభుదేవా చేసిన చికుబుకు రైలే పాటను హిందీలో చిరంజీవి చేశారు. సౌత్ ఇండియాలో ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ గౌతమి నటించగా… హిందీలో ఇదే పాటను రోజాతో చేయించారు. అంతకంటే ముందు రోజా నాగార్జున హీరోగా వచ్చిన రక్షణ సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో మెరిసింది.