సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ దొరికిందంటే నటీమణులను వాడుకుని వదిలేసే వాళ్లు చాలా మంది ఉంటారు. కాస్త సందు దొరికినా దూరిపోతుంటారు. అవకాశాల పేరుతో వల వేసి జీవితాలను నాశనం చేస్తుంటారు. కాబట్టి సినిమాల్లోకి వచ్చే నటీమణులు చాలా జాగ్రత్తగా ఉండాలని సినిమాల్లో అప్పటికే సక్సెస్ అయినవారు చెబుతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో ప్రతి చిన్న విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తేడా వస్తే వారి జీవితం తలకిందులు అయిపోతుంది.
ఇక దివంగత సీనియర్ నటి శ్రీవిద్య జీవితంలోనూ అలాంటి ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నారట. శ్రీవిద్య బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరవాత హీరోయిన్ గానూ నటించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శ్రీవిద్య నటించారు. శ్రీవిద్య చెన్నైలో జన్మించగా ఆమె తండ్రి ఆర్ కృష్ణమూర్తి తమిళంలో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీవిద్య తల్లి వసంతకుమారి కర్నాటక సంగీతం ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీవిద్య పుట్టిన ఏడాదికే ఆమె తండ్రి అనారోగ్యం భారినపడి మృతి చెందడంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆమె బాలనటిగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. తెలుగులో తాతమనవడు సినిమాలో బాలనటిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తన అందం అభినయంతో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంది. ఢిల్లీ టూ మద్రాస్ సినిమాతో శ్రీవిద్య హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి హీరోయిన్ కు పోటీ ఇచ్చారు. హీరోయిన్ గా సక్సెస్ అవుతున్న కాలంలో శ్రీవిద్య – కమల్ హాసన్ ప్రేమించుకుంటున్నారని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి.
కమల్ తో శీవిద్య పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో కమల్ .. వాణి గణపతితో ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న శ్రీవిద్య ఆయనకు దూరంగా ఉన్నారట. ఆ సమయంలో కమల్‌పై దారుణంగా విమర్శలు కూడా వచ్చాయి. చాలా మంది కమల్ హాసన్ ను తిట్టారు కూడా. ఈ నేపథ్యంలోనే శ్రీవిద్య కూడా తమిళ సినిమాలకు కాస్త దూరమై మలయాళంలో బిజీ అయ్యారట. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ జార్జిథామస్ తో శ్రీవిద్య ప్రేమలో పడ్డారు. ఇంట్లో వద్దని చెప్పినా వినకుండా జార్జి థామస్ కోసం మతం మార్చుకుని శ్రీవిద్య పెళ్లి చేసుకున్నారు.
కానీ ఆ తరవాత జార్జి థామస్ చెడు అలవాట్ల గురించి శ్రీవిద్యకు తెలిసింది. శ్రీవిద్య సినిమాల్లో సంపాదించింది అంతా జార్జి జల్సాలకు వాడుకున్నాడు. దాంతో అతడికి శ్రీవిద్య విడాకులు ఇచ్చేసింది. ఆ తరవాత భరతన్ అనే మరో దర్శకుడి మాయలో శ్రీవిద్య పడ్డారు. అతడు కూడా శ్రీవిద్యను మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నారు. ఇలా శ్రీవిద్య తన జీవితంలో సంతోషంగా గడిపిన క్షణాల కంటే బాధపడిన క్షణాలే ఎక్కువ.