టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్స్‌గా రాణించిన వారిలో ఛార్మి కౌర్ ఒకరు. ఈ పంజాబీ బ్యూటీ 2002లో నీతోడుకావాలని సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపక్ హీరోగా చేశాడు. కానీ మంత్ర, పౌర్ణమి లాంటి సినిమాలతో ఛార్మికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరవాత వరుస పెట్టి సినిమాలు చేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు జోడీగా నటించింది. తక్కువ టైంలోనే తన హాట్నెస్, నటనతో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
ఇక ఛార్మి క్రేజ్ తగ్గుతున్న క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జ్యోతి లక్ష్మి అనే సినిమాలో నటించి మరోసారి తనఖాతాలోసూపర్ హిట్ ను వేసుకుంది. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో వేశ్య పాత్రలో నటించి ఛార్మి అదరగొట్టింది. అంతే కాకుండా ఈ సినిమాలో తన గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తరవాత ఛార్మికి మళ్లీ సరైన హిట్ పడలేదు. ఈ సినిమా సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ పరిచయం ఏర్పడింది. ఆ తరవాత నుండి ఛార్మి పూరిజగన్నాత్ తో కలిసి సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారిపోయింది.
పూరీ, ఛార్మి కలిసి నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరవాత పూరి దర్శకత్వంలో వచ్చిన మరికొన్ని సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహించింది. ఇక ఇప్పుడు ఏకంగా లైగర్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి, ఛార్మి కలిసి నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్లలో ఛార్మీ హంగామా మామూలుగా లేదు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఛార్మి వయసు ప్రస్తుతం 35 ఏళ్లు అయినప్పటికీ పంజాబీ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగానే ఉంది.
అయితే అప్పట్లో ఛార్మి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసింది. తాను ఇప్పటికే ఒకడిని నమ్మి మోసపోయానని… అందుకే పెళ్లి చేసుకోలేదని చెప్పింది.అయితే అప్పట్లో ఛార్మి ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపించిందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతే కాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఆమె సర్వస్వం కూడా అర్పించేసుకుందట. అతడి వల్లే ఛార్మి పెళ్లి దూరమైందన్న గుసగుసలు కూడా అప్పట్లో టాలీవుడ్లో వినిపించాయి.