జయప్రద తెలుగు చిత్రసీమలో పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల పక్కన జయప్రద హీరోయిన్గా నటించి అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవిలకు జోడీగా నటించింది. తన కెరీర్ లో జయప్రద మొత్తం మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఒకేరకమైన పాత్రలకు ఫిక్స్ అవ్వకుండా విలక్షణ పాత్రల్లో నటించి అలరించింది. తెలుగమ్మాయి అయిన జయప్రద ఇటు సౌత్ ఇండియాతో పాటు అటు బాలీవుడ్‌ను కూడా ఏలేసింది.
ఇదిలా ఉండగా ఇప్పటి హీరోయిన్ లు బికినీలు వేసుకోవడం అంటే పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా కేవలం సినిమాల్లోనే కాకుండా టైం పాస్ కోసం బీచ్ లకు వెళుతూ బికినీలో ఫోటో షూట్లు చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అసలు ఇప్పుడు బికినీ వేయకపోతే హీరోయిన్నే కాదన్నట్టుగా ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే హీరోయిన్లు బికినీలు వేయాలి.. ఫుల్లుగా ఎక్స్పోజింగ్ చేయాలి.
కానీ ఒకప్పటి హీరోయిన్ లు అలా కాదు పాత్ర డిమాండ్ చేస్తేనే గ్లామర్ షో చేసేవారు. ఇక బికినీ వేసుకోవడం అంటే అప్పటి హీరోయిన్ లకు పెద్దసాహసమే. ఇక హీరోయిన్ జయప్రద తన సినీకెరీర్ లోనే ఒకే ఒక్కసారి బికినీ వేసుకుంది. అది కూడా ఓ డైరెక్టర్ బలవంతం వల్ల వేసుసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన ఆసక్తికర సంఘనను జయప్రద ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సాధారణంగా తన సినిమాలను తాను చూసుకోనని జయప్రద చెప్పింది. ప్రతి సినిమాకు మొదటి సినిమాలానే భయపడిపోతానని తెలిపింది.
ఇక తాను గురువుగారు దాసరినారాయణ రావు దర్శకత్వంలో దేవుడే దిగి వస్తే అనే సినిమాలో నటించానని చెప్పింది. ఆ సినిమాలో ఒకసన్నివేశం ఉందని దాసరి తనను డ్రెస్ మార్చుకుని రమ్మన్నారని తెలిపింది. తాను డ్రెస్ కోసం వెళ్లగా అక్కడ బికినీ ఉందని… దాంతో తాను దాసరి వద్దకు వెళ్లి వేసుకోను అంటే వేసుకోను అని ఏడ్చేశానని చెప్పింది. దాంతో దాసరి అక్కడేమి కనపడదు..భయపడకు వెళ్లి వేసుకుని రా అని చెప్పారని తెలిపింది.
దాంతో తాను ఏమి చేయలేక వేసుకుని వచ్చానని…ఆ తరవాత స్విమ్మింగ్ ఫూల్లో ఓ టైర్ లో సన్నివేశాన్ని చిత్రించారని వెల్లడించింది. ఆ తరవాత తాను బికినీ వేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే అప్పట్లో జయప్రద కాస్త హాట్‌గా నటించడం పెద్ద సంచలనమే అయ్యింది.