అనుపమ పరమేశ్వరన్..ఎంత అందంగా ఉంటుందో అంతకన్న మంచి మనసు ఉంది అంటుంటారు ఆమెను ఇష్టపడే జనాలు. నిన్న మొన్నటి వరకు డౌన్ గా సాగిన ఈమె కెరీర్..ఇప్పుడు జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా కాలమే అయినా అమ్మడు స్టార్ హీరొయిన్ల లిస్ట్ లోకి వెళ్లలేకపోతుంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. పెరుగుతున్న ఫాస్ట్ జనరేషన్ అందాలను అనుపమ తట్టుకోలేకపొతుంది. గ్లామర్ ప్రపంచంలో ఎదురవుతున్న టఫ్ ఫైట్ ని అనుపమ ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలనే చూస్తుంది.
కానీ, ప్రతిసారి ఫెయిల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో మరీ హాట్ డ్రెస్లు వేస్తూ..కుర్రాళ్ల కళ్లల్లో పడాలని చూసింది. అందులో భాగంగానే ఏకంగా కుర్ర హీరోకి లిప్ కిస్ ఇచ్చింది. అంతేనా..రెచ్చిపోయి హగ్గులు ఇవ్వడమే కాకుండా ఘాటు గా రొమాన్స్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఆ తరువాత దానికి వివరణ ఇచ్చి కూల్ చేసినా..అభిమానులు అనుపమ ను కంట్రోల్ ఉండమంటూ వార్న్ చేస్తున్నారు. ప్రజెంట్ అమ్మడి చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి . వాటిలో యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 కూడా ఉంది.
అయితే, సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్ళు గడుస్తున్న అనుపమ ఇంకా స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరకపోవడానికి కారణం ఆమె టం. నోటి దూల అంటారు కొందరు నటులు ఎవ్వరైతే ఆమెతో పని చేసిన వారుంటారో. అనుపమకు కోపం ఎక్కువట. సాధారణంగా రాదు..వస్తే అంత ఈజీగా పోదు. తనకు కోపం వస్తే అవతల ఉన్నది ఎంతటి పెద్ద స్టార్ హీరోనైన..అమ్మడు లెక్క చేయదట. నోటికి వచ్చిన మాట అనేస్తుందని..ఆ కోపాని చూసే కొందరు దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తమ సినిమాలోకి తీసుకోవట్లేదని టాక్ ఉంది. ఆ కోఫం కొంచెం అనుపమ తగ్గించుకుంటే చాలా బాగుంటుంది..మంచి అవకాశాలు వస్తాయి అనేది అభిమానుల అభిప్రాయం. మరి చూడాలి అను ఏం చేస్తుందో..?