ఏ సినిమా హీరోకైనా.. తన పక్కన నటించే జోడీ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అందరికీ తెలిసిందే. ఏదైనా సినిమాలో హీరోయిన్ను బుక్ చేయాలంటే.. హీరో సమ్మతి తీసుకోవాల్సిందే. ఒక్కొక్కసారి.. సినిమాల్లో దర్శకుడు.. హీరో కూడా సంయుక్తంగా హీరోయిన్ను సెలక్ట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. సినిమా స్టోరీని బట్టి.. దర్శకుడు.. హీరోయిన్ను ఎంచుకునేవారు. దీనిని నిర్మాత ఓకే చేసేవారు.
కథ.. కథనం.. హీరోయిన్ పాత్ర.. వంటి వాటికి పెద్ద పీట వేసేవారు. అప్పట్లో హీరోలతో సమానంగా హీరోయిన్ల పాత్రలు ఉండేవి. హీరోయిన్లు కూడా పోటీ పడి మరీ నటించేవారు. అయితే.. ఈ ట్రెండ్ ఇప్పుడు మారిపోయింది. హీరోకి తగినట్టుగా హీరోయిన్ను ఎంపికచేస్తున్నారు. పైగా .. ఒకటి రెండు సినిమాల్లో నటిస్తేనే ఎక్కువ అనుకునే పరిస్థితి ఇప్పటి హీరోయిన్లది. ఇప్పుడు హీరోయిన్లకు కథా పరంగా స్కోప్ ఉండడం లేదు. కేవలం గ్లామర్ రోల్స్‌కు, పాటల్లో డ్యాన్సులు వేసే బొమ్మలుగా మారిపోతున్నారు.
గతంలో అలా కాదు కదా. అయితే..అక్కినేనితో ఉన్న ఈజ్ ఆఫ్.. యాక్టింగ్.. ఎన్టీఆర్‌తో లేదనే టాక్ ఉండే ది. అంటే.. అక్కినేని అనేక మంది హీరోయిన్లతో నటించారు. కానీ, ఎన్టీఆర్ అలా కాదు.. ఎక్కువగా.. సావి త్రితోనే ఆయన సినిమాలు కనిపిస్తాయి. దీనిని బట్టి.. ఆయన ఇతర హీరోయిన్లతో పెద్దగా చేసినట్టు మనకు కనిపించదు. ఈ తేడా అక్కినేని విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కినేని హీరోయిన్లను సరదాగా ఆట పట్టించడంతో పాటు జోకులు వేస్తూ హీరోయిన్లను బాగా మచ్చిక చేసుకునేవారట.
ఆయన ఒక్కోసారి హీరోయిన్లను సరదాగా బూతులు కూడా తిట్టేవారట. ఎన్టీఆర్ మాత్రం హీరోయిన్లతో చాలా సీరియస్‌గానే ఉండేవారట. మనం సెట్క వచ్చామా ? నటించామా ? మన పాత్రకు న్యాయం చేశామా ? ఇవే ఎక్కువుగా ఆలోచించేవారట. అందుకే హీరోయిన్లతో అక్కినేనికి ఉన్నంత ఎటాచ్మెంట్ ఎన్టీఆర్‌కు ఉండదనే చెపుతారు.
తెలుగు హీరోయిన్లతోనే కాకుండా.. బాలీవుడ్.. ఇతర రాష్ట్రాల హీరోయిన్లతోనూ.. అక్కినేని నటించారు. కానీ, ఎన్టీఆర్ అలా నటించలేదు. రోహిణి హట్టంగడి.. వంటి వారితో అక్కినేని తెరను పంచుకున్నారు. కానీ, అన్నగారు అలా చేయలేదు. ఇది పెద్ద లోటనే చెప్తారు.. అన్నగారి అభిమానులు. అయినా.. తనదైన శైలిలో హీరోయిన్లు ఎవరితో చేసినా.. మెప్పించిన అన్నగారు.. తెలుగు సినీ వినీలాకాశంలో చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే.