మెగాస్టార్ చిరంజీవితో అప్పటి తరం హీరోయిన్స్ విజయశాంతి, రాధ, సుహాసిని, సుమలత, రాధిక, భానుప్రియ, మాధవి లాంటి వారు వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్స్‌గా మారారు. వీరందరూ ఆయనకి హిట్ పేయిర్‌గా నిలిచిన వారే. ఈ హీరోయిన్స్ ఒక్కొక్కరు చిరంజీవి సరసన మూడు నాలుగు సినిమాల కంటే ఎక్కువే చేశారు. ఆయనతో సినిమా చేస్తే స్టార్ హీరోయిన్ అవుతారనే టాక్ అప్పట్లో బాగా వినిపించేది. అప్పటి కథలు కూడా అలా ఉండేవి. ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేది.
అయితే, రానురాను జనాల అభిరుచి మారిపోతోంది. ఒక హీరోయిన్ ఎక్కువసార్లు ఒకే హీరోతో సినిమా చేస్తే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి ఎప్పటికప్పుడు కొత్త సరుకు దిగాలి. అందాలు ఆరబోయాలి. కవ్వించాలి.. గిలిగింతలు పెట్టాలి. అదే లేకపోతే హీరోయిన్స్ మీద సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే, సౌందర్య..రమ్యకృష్ణ, మీనా జనరేషన్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రచన. బెంగాలీ నటి అయిన రచన ఒరియాలో 50 సినిమాలు చేస్తే వాటిలో ఒకే హీరోతో 40 సినిమాలు చేయడం విశేషం.
హిందీలో అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర నటుడితోనూ రచన సినిమా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఆమె తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా స్టార్ డం సంపాదించుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, జగపతిబాబు లాంటి స్టార్స్ సరసన సినిమాలు చేసింది రచన. కానీ, వీటిలో ఒక్కటి కూడా రచనని స్టార్ హీరోయిన్ని చేయలేకపోయింది. దీనికి కారణం ఆ సినిమాలలో రచన పాత్రకి ఎంతమాత్రం ప్రాధాన్యం లేకపోవడమే. కాస్తో కూస్తో అందాల ఆరబోతతో ఆకట్టుకుందామని ప్రయత్నం చేసినా పాపులర్ కాలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బావున్నారా.. సినిమా సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. కానీ, ఇది ఏమాత్రం తన కెరీర్ కి పనికిరాలేదు. రంభ మెయిన్ హీరోయిన్ కావడం దీనికి ప్రధాన కారణమైతే రచన పాత్ర కి ఇంపార్టెన్స్ లేకపోవడం మరో కారణం. చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ గ్లామర్ గా కనిపిస్తుందని ఆయనతో రొమాన్స్ చేస్తుందని ఊహిస్తారు. కానీ, ఇక్కడ సీన్స్ రివర్స్ కావడంతో దెబ్బకొట్టింది. తెలుగులో రచన సక్సెస్ కాకపోవడానికి ఇలాంటి కారణాలే అని చెప్పకతప్పదు.