సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఆరేడేళ్ల తర్వాత తాజాగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో నటించిన వేణు ఆ తర్వాత చాలా రోజుల పాటు సినిమాలకు దూరమైపోయాడు. రామారావు డైరెక్టర్ శరత్ మండవ చెప్పిన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించేందుకు వేణు ఓకే చెప్పాడు. ప్రస్తుతం వేణు ఈ సినిమా ప్రమోషన్లలో పలు ఆసక్తికర విషయాలు చెపుతున్నాడు.
ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో పాటు తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి కూడా వేణు చెపుతున్నాడు. ఇక వేణుకు నందమూరి బాలకృష్ణకు మధ్య రిలేషన్ ఉంది. వేణు వరుసకు బాలయ్యకు తమ్ముడు అవుతాడు. వేణుకు బలమైన పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వేణు ఫ్యామిలీ నుంచి ఎంపీలు, కేంద్రమంత్రులు కూడా అయ్యారు. వేణు మేనమామ మాగంటి అంకినీడు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు.
ఇక వేణు పెదనాన్న కావూరు సాంబశివరావు కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు. కావూరు సాంబశివరావు మచిలీపట్నంతో పాటు ఏలూరు నుంచి కూడా ఎంపీగా.. ఓవరాల్‌గా ఐదుసార్లు ఆయన పార్లమెంటుకు ఎంపికయ్యారు. ఇక కావూరు కుమార్తె కొడుకు ( కావూరు మనవడు) మెతుకుమిల్లి శ్రీ భరత్ బాలయ్యకు స్వయానా చిన్నల్లుడు అవుతాడు. ఈ లెక్కన కావూరు కుమార్తె ( అంటే బాలయ్య వియ్యపురాలు ) వేణుకు సోదరి అవుతుంది.
అలా బాలయ్య కూడా వేణుకు అన్నయ్యే అవుతాడు. బాలయ్య – వేణు పబ్లిక్ ఫంక్షన్లలో పెద్దగా కలుసుకోకపోయినా వీరి మధ్య మంచి అనుబంధమే ఉంది. వేణు నందమూరి ఫ్యామిలీస్‌తో బాగా రిలేషన్ షిఫ్ మెయింటైన్ చేస్తాడు. ఇక ప్రస్తుత ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వేణుకు స్వయానా బావ. వేణు సోదరినే నామా పెళ్లి చేసుకున్నారు. వేణు గతంలో నామా గెలుపు కోసం ఖమ్మంలో ప్రచారం కూడా చేశారు.
ఇక వేణుకు ఫ్యామిలీ తరపున పెద్ద బిజినెస్‌లు ఉన్నాయి. వేణు కూడా వ్యాపారాల్లో బాగా ఆరితేరిపోయాడు. వేణు బిజినెస్‌ల ద్వారా కూడా కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఇక టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్‌కు వేణు స్వయానా మేనల్లుడు. ఇలా వేణుకు అటు పొలిటికల్ పరంగాను, ఇటు సినిమాల పరంగాను బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది.