దర్శకేంద్రు కె. రాఘవేంద్రరావు ఎంతోమంది హీరోలకు తన సినిమాలతో లైఫ్ ఇచ్చారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్‌తో మొదలు పెడితే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు ఆ తర్వాత జనరేషన్ హీరోలకు కూడా సూపర్ హిట్లు ఇచ్చారు. శ్రీకాంత్ కు పెళ్లి సందడితో లైప్ ఇచ్చిన ఆయన.. బొంబాయి ప్రియుడు సినిమాతో జేడి చక్రవర్తికి కూడా మంచి హిట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా సినిమాల్లోకి వచ్చిన జెడి. చక్రవర్తికి తన గురువు సినిమాల్లో మాత్రమే గుర్తింపు వచ్చింది. అయితే సోలో హీరోగా జేడి చక్రవర్తికి సరైన హిట్ పడలేదు.
అలాంటి సమయంలో రాఘవేంద్రరావు తన స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన బొంబాయి ప్రియుడు సినిమాలో జేడిని హీరోగా పెట్టుకున్నాడు. తాను అనుకున్న కథకు కొత్త హీరో అయితే బాగుంటాడు అన్న అలోచనతో జేడి చక్రవర్తిని అయన ఎంపిక చేసుకున్నారు. అప్పట్లో ఫామ్‌లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకున్నారు. 1996 లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రంభ తల్లిగా సీనియర్ నటి వాణిశ్రీ నటించారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వంతో పాటు కీరవాణి మ్యూజిక్ కూడా హైలెట్‌గా నిలిచింది. అసలు ఈ సినిమాలోని పాటలు అయితే రెండు సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసాయి.
ఈ సినిమా షూటింగ్ టైంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. రాఘవేంద్రరావు జేడీ, రంభలపై కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తుండాగా జేడి రంభను ఆట పట్టిస్తు ఆ సీన్‌లో సరిగా నటించడం లేదట. జేడి, రంభ ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఉండడంతో రాఘవేంద్రుడు అనుకున్నట్టుగా ఆ సీన్ రావటం లేదు. దీంతో రాఘవేంద్రరావు వీళ్ళిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు మీరిద్దరూ ఎంతసేపు ఆట అడుకుంటారో చెప్పండి.. మీ ముచ్చట్లు అయిపోయాకే తాను షూటింగ్ చేస్తానని చెప్పి సెట్ నుంచి బయటకు వచ్చేశారట.
అయితే వాస్తవంగా జేడి రంభను ఆట పట్టిస్తూ ఉండంతో తాను ఆ సీన్‌పై సరిగా దృష్టి పెట్టలేకపోయానని.. ఓ సందర్బంలో చెప్పింది. తాను చేయని పొరపాటుకు రాఘవేంద్రరావు గారి నుంచి తాను చీవాట్లు తినాల్సి వచ్చిందని.. ఆమె సెట్‌లో భోరున ఏడ్చేసింది అట. ఆ తర్వాత అక్కడ ఉన్నవారు వచ్చి సర్ది చెప్పడంతో చివరకు ఆ సీన్‌ను రీ షూట్ చేశారట దర్శకేంద్రుడు. కేవలం జేడి వల్లే ఆయనతో తిట్లు తినాల్సి వచ్చిందని ఆమె స్వరాభిషేకం ఎపిసోడ్‌లో చెప్పింది. ఈ సినిమా హిట్ అయ్యక వీరిద్దరికి మంచి పేరు వచ్చింది.