Movies"రామారావు ఆన్ డ్యూటీ": రవితేజ డ్యూటీ ఎక్కేశాడ్రోయ్.. హై ఓల్టేజ్ మాస్...

“రామారావు ఆన్ డ్యూటీ”: రవితేజ డ్యూటీ ఎక్కేశాడ్రోయ్.. హై ఓల్టేజ్ మాస్ జాతరే..!!

హమ్మయ్య..ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మాస్ మహరాజ రవితేజ్ హిట్ కొడితే చూడాలి అని ఎంతో మంది అభిమానులు కాచుకుని కూర్చున్నారు. మిగత హీరో ఫ్యాన్స్ సినిమాలు హిట్ అవుతూ..ఉంటే..సరికొత్త రికారడ్లు క్రియేట్ చేస్తుంటే..రవితేజ అభిమానులు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, అబ్బాయిలు ఇప్పుడు మీ టైం వచ్చింది. కాలర్ ఎగరేయండి. మేం రవితేజ ఫ్యాన్స్ అంటూ గర్వంగా చెప్పుకొండి. అన్న హిట్ కొట్టాడు..రవితేజ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ మాట అభిమానులకు ఎంతో ఊపునిస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన చిత్రం.. “రామారావు ఆన్ డ్యూటీ”. ర‌జిషా విజ‌య‌న్‌ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయాడు శరత్ మండవ. ఫస్ట్ సినిమా నే అయినా స్క్రీన్ ప్లే చాలా చక్కగా ఉంది. మరి ముఖ్యంగా అభిమానుల నాడి పట్టి రవితేజ ను ఈ సినిమాలో ఓ సరికొత్త స్టైల్ లో చూయించాడు. దాంతో ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకోవడం తో సినిమా పై భారీ స్దాయిలో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. వాళ్ళని ఏ మాత్రం డిస్సపాయింట్ చేయకుండా..సినిమాని లాక్కొచ్చాడు శరత్ మండవ..

ఫస్ట్ హాఫ్ స్లో గా సాగిన..ఇంటర్వెల్ బ్యాంగ్ లో మాత్రం ఊహించని ట్వీస్ట్ పెట్టి అభిమానులకు షాక్ ఇచ్చాడు. డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో మాస్ మహారాజ హై ఓల్టేజ్ పర్ ఫామెన్స్ ధియేటర్స్ జనల చేత విజిల్స్ వేయిస్తుంది. హీరోయిన్స్ ని ఎక్కడ వాడాలో అక్కడే వాడారు. సినిమా మొత్తానికి రవితేజ వన్ మ్యాన్ ఆర్మీ లా కనిపిస్తాడు. ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ తో రవితేజ అభిమానులకు ఫుల్ మీల్స్ వడ్డించేసాడు. హీరోగా గా పనికి రాడు అన్న వాళ్లకి దుమ్ముదులిపేశాడు రవితేజ.

ఓల్డ్ స్టోరీనే అయినా..శరత్ మండవ తనదైన స్టైల్ లో మార్పులు చేస్తూ జనాలకి బోర్ కొట్టించకుండా ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ ఇరగదీశాడు . ఈ సినిమాలో రవితేజ మాస్‌ డైలాగ్స్, ఎనర్జిటిక్‌ పర్ ఫామెన్స్, జనాలను బాగా అట్రాక్ట్ చేసాయి. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఫాంలోకి వచ్చారు హీరో వేణు తొట్టెంపూడి . ఈ సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేశాడు.

సెకండ్ హాఫ్ లో మనం అసలైన రవితేజను చూడవచ్చు. ఈ సినిమా చూసిన అంత సేపు రవితేజ ఓ పొలిటీషన్ పార్టీని గట్టిగా టార్గెట్ చేసిన్నట్లు తెలుస్తుంది, ఆయన నోటి నుండీ వచ్చే ఒక్కో మాస్ డైలాగ్స్‌ పరోక్షంగా వాళ్లకి తగిలేలా ఉన్నాయి. ఫ్యాన్స్ కి మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఓ వైపు డీసెంట్ మరో వైపు మాస్..రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకొచ్చాడు ఈ హీరో.. పాటలు తావరేజ్ గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం సూపర్‌గా ఉంది. ఫైనల్లీ ఇన్నాళ్లకు బాక్స్ ఆఫిస్ వద్ద రవితేజ డ్యూటీ ఎక్కేసాడు..అంటున్నారు జనాలు. మరి చూడాలి కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం కలెక్ట్ చేస్తాడో ఈ రామారావు..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news