నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతుంది. నందమూరి బ్రాండ్ ఉన్నా స్టార్ హీరో కాలేదు కళ్యాణ్. అయితే తన సొంత బ్యానర్‌పై తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు. టాలెంట్ ఉన్న దర్శకులను పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు స్టార్ డైరెక్టర్లుగా ఉన్న సురేందర్‌రెడ్డి, అనిల్ రావిపూడి ఇద్దరూ కళ్యాణ్‌రామ్ పరిచయం చేసిన వారే.
ఇక కళ్యాణ్‌రామ్ నటించిన బింబిసార మూవీ ఆగస్టు 5న థియేటర్లలోకి రానుంది. మల్లిడి వశిష్ట్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కేథరిన్ థెస్రా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. క్రీస్తు శకం 5వ శతాబ్దం నాటి మగధ సామ్రాజ్య రాజు బింబిసారుడి చరిత్రకు ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ రు. 37 కోట్లతో బింబిసార తెరకెక్కింది.
ఈ సినిమా ప్రమోషన్లలో కళ్యాణ్‌రామ్ స్పీడ్‌గా ఉన్నాడు. ఈ క్రమంలోనే అప్‌క్లోజ్ విత్ ఎన్కేఆర్ పేరుతో వీడియోలు రిలీజ్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. కళ్యాణ్‌రామ్ 1989లో 7వ తరగతి చదువుతున్న టైంలోనే బాబాయ్ నటించిన బాలగోపాలుడు సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పరంగా బాబాయ్ అక్షరాభ్యాసం చేయించాడని… రామోజీరావు గారు నిర్మాతగా, కాశీ విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో తన తొలి సినిమా తొలిచూపులోనే తెరకెక్కిందని కళ్యాణ్ చెప్పాడు.
తన తొలి రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో .. అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు ఇక్కడకు వచ్చి ఫెయిల్ అయ్యాడని ఇండస్ట్రీలోనే కొందరు తనను విమర్శించారని కళ్యాణ్ చెప్పాడు. ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ అనుకుని.. తన పరాజయాల నుంచే తాను నేర్చుకున్నానని కళ్యాణ్ తెలిపాడు. కళ్యాణ్‌రామ్ చెప్పిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.