టాలీవుడ్లో సినీయర్ దర్శకుడు కోడి రామకృష్ణ – నందమూరీ బాలకృష్ణ కాంబోలో సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇంకా చెప్పాలిలంటే తాతమ్మకల సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బాలకృష్ణకు హీరోగా తొలి కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన ఘనత కోడి రామకృష్ణకే దక్కుతుంది. కోడి రామకృష్ణ – బాలయ్య దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారిమనవడు బాలయ్యకు తొలి సిల్వర్‌జుబ్లీ సినిమాగా రికార్డులకు ఎక్కింది. అప్పట్లోనే ఏకంగా మూడు థియేటర్లలో సంవత్సరం అడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఈ సినిమా తర్వత బాల్యయ ఇక వెనక్కు తిరిగి చూసుకున్నదిలేదు. దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. మెగాఫోన్ పట్టిన కోడి రామకృష్ణ తన గురువు బాటలోనే 100కు పైగా సినిమాలకు తన దర్శకత్వం వహించిన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.
అప్పట్లో దాసరి, రాఘవేంద్రరావు తర్వాత ఎక్కువుగా వినిపించిన పేరు కోడి రామకృష్ణదే. గ్రామీణ నేపథ్యంలో కథలను, కుటుంబ నేపథ్య కథలను, భక్తిరస చిత్రాలను తీయడంలో కోడి రామకృష్ణ తర్వాతే ఎవరైనా.. ! తెలుగు సినిమాకు అద్బుతమైన గ్రాపిక్స్ను పరిచయం చేసి సూపర్ హిట్లు కొట్టిన చరిత్ర కూడ ఆయనకే దక్కుతుంది.
చాల మంది స్టార్ హీరోలకు కోడి రామకృష్ణ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. ఇంక చెప్పాలంటే స్టార్ హీరోలు లేక పొయినా భక్తిరస చిత్రాలను తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఆయన స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చినా వరుసగా ఇండస్ట్రీ హిట్లు మాత్రం బాలయ్యకే ఇచ్చారు. బాలయ్య – కోడి రామకృష్ణ కాంబోలో వరుసగా మంగమ్మగారిమనవడు, ముద్దలమావయ్య, ముద్దలక్రిష్ణయ్య, మువ్యగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత కూడ 2001లో ఎస్. గోపాలరెడ్డి నిర్మాణంలో బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ భారీ జానపద చిత్రాన్ని మొదలు పెట్టారు. అయితే ఆ సినిమా పూర్తి కాలేదు.
ఆసలు ఈ సినిమా ఎందుకు ? మధ్యలోనే అపేశారో తెలియదు. తాజాగా కోడి రామకృష్ణ కూమర్తె దివ్య ప్రొడ్యుసర్‌గా మరిన సంగతి తెలిసిందే. అమె తొలి సినిమా ప్రమోషన్లలో బాలయ్య సినిమా ఎందుకు ?అగిపోయిందో చెప్పింది. ఈ సినిమా బడ్జెట్ కారణంగా అగిపొయిందన్న వార్తలు అప్పటిలో వినిపించాయి. అందులో ఎంత మత్రం నిజం లేదు అన్ని.. గోపాల్‌రెడ్డి గారి కుటుంబ పరమైన కారణలు, అయన ఆనారోగ్య కారణాలతోనే ఆ ప్రాజెక్ట్ మధ్యలో అగిపోయిందని ఆమె చెప్పారు.
అప్పటికే సినిమా షుటింగ్ 75 శాతం పూర్తయ్యిందని…మరో 25 శాతం పూర్తవుతుందనగా మధ్యలోనే ఆగిపోయిందని దివ్య తెలిపారు. గోపాలరెడ్డి గారు కోలుకున్న తర్వాత సినిమా పూర్తి చేయలని చూసినా.. కుదరలేదు అని చెప్పింది. అప్పట్లో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీయాలని.. రామోజీ ఫిలింసిటిలో భారీ సెట్లు కూడా వేశారు. ఈ సినిమా నిజంగా పూర్తిఅయ్యి ఉంటే బాగుండేదని దివ్య చెప్పింది. ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలని బాలయ్య – కోడి రామకృష్ణ అనుకున్నా చివరకు అది జరగలేదు.