సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటే… మరికొందరు మాత్రం వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తూ పాపులారిటీ సంపాదించుకుంటారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పేరు సంసాదించుకున్న నటి శ్రీరెడ్డి. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం తెరపైకి తీసుకువచ్చి టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనం సృష్టించింది. అంతే కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ముందు పై దుస్తులు విప్పి నానా రచ్చ చేయడంతో నేషనల్ మీడియాలో సైతం శ్రీరెడ్డి పేరు మారుమోగిపోయింది. ఏకంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత సురేష్‌బాబు తనయుడు అభిరామ్ తనతో వాళ్ల స్టూడియోలోనే శృంగారంలో పాల్గొన్నాడని.. అవకాశాలు ఇప్పిస్తానని తనను మోసం చేశాడని సంచలన ఆరోపణలు చేసింది.
ఆ తర్వాత ఫిల్మ్ఛాంచర్ ముందు ఆమె అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం రేపింది. ఆ తరవాత శ్రీరెడ్డికి గుర్తింపు వచ్చింది కూడా..! ఆ టైంలోనే దగ్గుబాటి అభిరామ్ తో పర్సనల్ గా దిగిన ఫోటోలను బయటపెట్టి
ఇండస్ట్రీలో స్టార్స్ భాగోతాలను చాలా వరకు బట్టబయలు చేసింది. ఇక్కడితో ఆగకుండా సింగర్ శ్రీరామ్ తో చేసిన చాట్ ను కూడా బయటపెట్టి పరువుతీసింది. అంతే కాకుండా హీరో నాని, దర్శకుడు శేఖర్ కమ్ములపై సైతం ఆరోపణలు చేసింది. దాంతో శ్రీరెడ్డిని మా సభ్యత్వం నుంచి తొలగించారు. ఆ తరవాత శ్రీరెడ్డి తన మకాంను చెన్నైకి మార్చుకుంది.
చెన్నైలో కూడా హీరో విశాల్ వాడుకున్నాడని.. అలాగే సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తనతో ఒక రోజు గడిపాడని పెద్ద బాంబులే వేసింది. ప్రస్తుతం యూట్యూబ్ లో వంటల వీడియోలు చేస్తూ యూత్ ను ఆకట్టుకుంది. వంటల్లో మసాలా ఏమోగానీ ఆమె వీడియోలలోనే మసాలా ఎక్కువ అవ్వడంతో యూత్ ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో మాంచి పాపులారిటీ వచ్చేసింది. మరోవైపు ఏపీ.. తెలంగాణ రాజకీయాలపై కూడా ఎప్పుడూ వీడియోలు చేస్తూ ఉంటోంది.
ఇంతకాలం వైసీపీకి సపోర్ట్ ఇచ్చిన శ్రీరెడ్డి కొద్దిరోజులుగా ఆ పార్టీపై కూడా మండిపడుతోంది. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి బిగ్ బాస్ బ్యూటీ అరియాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ లిప్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయంటూ బోల్డ్ బ్యూటి ఓపెన్ గా అడిగింది. దానికి శ్రీరెడ్డి తాను చిన్నప్పుడు మడత మంచంపై నుండి పడిపోయానని చెప్పింది. దాంతో తన పెదవి అందవిహీనంగా తయారైందని చెప్పింది.
పెదవి సరిగా లేకపోవడంతో తాను సర్జరీ చేసుకున్నానని చెప్పింది. అంతే కాకుండా తాను ఇండస్ట్రీ కోసం లైపో సర్జరీ కూడా చేసుకున్నానని చెప్పింది. తాను ఏదీ దాచుకోవడం లేదని…కానీ సర్జరీ చేసుకున్నా ఎవరూ చెప్పరని తెలిపింది. ఇక శ్రీరెడ్డి తన కుటుంబానికి దూరంగానే ఉంటోంది.