ఒకప్పటి హీరోయిన్ అంకిత తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ముంబాయిలో జన్మించిన ఈ అందాలభామ మూడు సంవత్సరాల వయస్సులోనే రస్నా యాడ్ చేసింది. అపటి నుండి రస్నా పాపగా పాపులర్ అయింది. ఆ తర్వాత కూడా పలు యడ్స్‌లో నటించినా… తెలుగులో వైవియస్.చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే హిట్ కొట్టడంతో అంకితకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. వరసగా సూపర్- డూపర్ హిట్టులు పడ్డాయి.
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన సింహాద్రి సినిమాలో భూమిక మెయిన్ హీరోయిన్ కాగా… అంకిత సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టు కావడంతో అంకితకు తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత అంకిత తెలుగులో వరుసగా స్టేట్‌రౌడీ, బాల్యయతో విజయేంద్రవర్మ, సీతారాముడు, అనూసుయ, వినాయకుడు సినిమాలు చేసింది. అలాగే తమిళ్ లోను కొన్నిసినిమాలలో నటించింది. ఆ టైంలో ఓవర్ ఎక్స్‌పోజింగ్‌తో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టింది
అనంతరం కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా వరసగా ప్లాపులు రావడంతో అంకిత కేరియర్ డౌన్ అయి పోయింది. ఆవకాశాలు తగ్గటంతో పుణేకు చేందిన వ్యాపారవేత్త విశల్‌ఝాటక్ ను వివాహం చేసుకుంది. ప్యామిలి లైఫ్‌లో సెటిల్ అయిపోంది. అంకిత – విశాల్ వివాహం ముంబైలోని ఫర్లీలో ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ దంపతులకు ఓ బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది అంకిత. తన తండ్రికి ఉన్న వజ్రాల వ్యాపారాన్నీ లీడ్ చేసుకుంటూ… అటు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేసుకుంటు కాలం గడుపుతుంది. రీసెంటుగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కేరియర్ లోనే సింహాద్రి మంచి టర్నింగ్ పాయింట్ అని.. తనకు తిరిగి సినిమాల్లోకి వచ్చే ఆసక్తి లేదు అని చెప్పింది.