సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పటి నుంచే కాదు.. గత నాలుగైదు దశాబ్దాలకు ముందు నుంచే ఉంది. ఇంకా చెప్పాలంటే 1960 – 70వ దశకంలోనూ హీరోయిన్లు ఆఫర్ల కోసం దర్శక నిర్మాతల ఒళ్లో వాలిపోయేవారు. ఇది నిజం.. తెలుగు ఇండస్ట్రీ అప్పుడు మద్రాస్‌లో ఉన్నప్పుడు కూడా ఎఫైర్లు, గాసిప్‌లు ఉండేవి. అయితే ఇప్పుడు ఉన్నంత డిజిటల్ మీడియా అప్పుడు లేకపోవడంతో ఈ విషయాలు బయటకు వచ్చేవే కావు. అయితే కాగడాతో పాటు ఒకటి రెండు సినీ వారపత్రికలు మాత్రమే ఈ గాసిప్‌లు రాసేవి.
అయితే ఇప్పుడు పెరిగిన డిజిటల్ మీడియా యుగంలో హీరోయిన్లకు భారీ ఎత్తున పబ్లిసిటీ వస్తోంది. ఇక ఇప్పుడు సంపాదన పెరిగిపోవడంతో హీరోయిన్లకు కమిట్మెంట్ ఆఫర్లతో పాటు ఇతరత్రా ఆఫర్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. హీరోయిన్లను బడా బిజినెస్మేన్లు సైతం ఒక్కో నైట్‌కు భారీ ఎత్తున అమౌంట్ ఆఫర్ చేసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
బడా బడా స్టార్ హీరోయిన్లే ఒక్క నైట్‌కు కళ్లు మూసుకుంటే బోల్డెంత సంపాదన వస్తుందని అడ్డదారులు తొక్కేస్తున్నారు. హీరోయిన్లకు కావాల్సింది డబ్బు.. డబ్బున్నోళ్లకు కావాల్సింది సెలబ్రిటీ హీరోయిన్లతో ఎంజాయ్మెంట్. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్‌కు ఓ దుబాయ్ బడా బిజినెస్‌మేన్ ఏకంగా రు. 100 కోట్లు ఆఫర్ చేశారట. ఈ విషయాన్ని సీనియర్ దర్శకుడు… ఇప్పుడు ఛాన్సులు లేక యూట్యూబ్ ఇంటర్వ్యూలతో కాలక్షేపం చేసుకుంటోన్న గీతాకృష్ణ చెప్పారు.
కాస్టింగ్ కౌచ్ గురించి ఆయన మాట్లాడుతూ ఇటీవల నీతూచంద్ర అనే ఓ హీరోయిన్ తనకు ఓ వ్యాపారవేత్త భార్యగా ఉన్నంత కాలం నెలకు రు. 25 లక్షలు ఇస్తానని చెప్పడంటూ చెప్పిన విషయంతో పాటు సాక్షి చౌదరి అనే హీరోయిన్ తనకు ఓ బిజినెస్‌మేన్ కమిట్మెంట్ ఇస్తే రు. కోటి ఇస్తానని చెప్పడంపై మాట్లాడుతూ వాళ్లు నిజంగా అలా అన్నారో లేదో తెలియదు.. కానీ వీళ్లు పబ్లిక్‌లో ఈ విషయాలు చెప్పి తమ మార్కెట్‌ను తెలివిగా పెంచుకుంటున్నారని ఆరోపించారు.
చాలా మంది హీరోయిన్లు కూడా డబ్బుల కోసం.. అక్కడ దుబాయ్ షేక్‌లకు సుఖం పంచేందుకు దుబాయ్ ట్రిప్పులు వేస్తూ ఉంటారని కూడా ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో ఓ ఫేమస్ హీరోయిన్‌కు ఓ బిజినెస్‌మేన్ రు. 100 కోట్లు ఆఫర్ చేశాడని.. ప్రస్తుతం ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అవ్వడంతో ఆమె పేరు చెప్పడం లేదని గీతాకృష్ణ చెప్పారు. ఆమె సెలబ్రిటీ అవ్వడం వల్లే ఆ రేంజ్లో క్రేజ్ ఉందని చెప్పారు. ఇక హీరోయిన్లను ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేసే బ్రోకర్లు కూడా ఉన్నారని.. వాళ్లకే రు. 50 లక్షల నుంచి కోటి వరకు కమీషన్లు ముడుతున్నాయని కూడా గీతాకృష్ణ తెలిపారు.