విక్టరీ వెంకటేష్‌కు 2001లో నువ్వునాకునచ్చావ్ లాంటి ఫ్యామిలీ హిట్ వచ్చింది. ఆ తర్వాత చేసిన వాసు, జెమినీ సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత 2003లో వసంతం లాంటి ఫ్యామిలీ హిట్ కొట్టాడు. ఆ వెంటనే రిస్క్ చేయకుండా మళ్లీ ఫ్యామిలీ కథాంశమైన మల్లీశ్వరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నువ్వునాకు నచ్చావ్ లాంటి ఫ్యామిలీ హిట్ ఇచ్చిన కె. విజయ్ భాస్కరే ఈ సినిమాకు కూడా దర్శకుడు.
సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో కూడా హీరోయిన్ విషయంలో కొత్త ప్రయోగం చేశారు. నువ్వునాకునచ్చావ్ సినిమాలో ఆర్తీ అగర్వాల్‌ను తీసుకురావడంతో ఆ సినిమా సక్సెస్‌లో ఆమే చాలా వరకు హైలెట్ అయ్యింది. ఇప్పుడు మల్లీశ్వరి కోసం కూడా అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కత్రీనాకైఫ్‌ను తీసుకువచ్చారు. కత్రినా కూడా ఈ సినిమాకు చాలా హెల్ఫ్ అయ్యింది.
అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో కత్రినా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిందట. ఈ సినిమా కోసం కత్రినాకు భారీగానే రెమ్యునరేషన్ అనుకున్నారు. సగం సినిమా షూటింగ్ అయ్యాక తన రెమ్యునరేషన్ పెంచాలని… తనతో పాటు తన టీంకు కూడా ఫ్లైట్ టిక్కెట్లు కావాలని.. హైదరాబాద్‌లో ఫైవ్‌స్టార్ హోటల్లో మూడు రూమ్‌లు కావాలని చాలా గొంతెమ్మ కోర్కెలు కోరిందట.
చివరకు కత్రినా తన డిమాండ్లు తీర్చేవరకు షూటింగ్‌కు కూడా రానని డుమ్మా కొట్టేసింది. షూటింగ్ ఆగిపోవడంతో చివరకు వెంకటేష్‌కు కూడా కత్రినాపై తీవ్ర ఆగ్రహం వచ్చేసింది. అటు నిర్మాత సురేష్‌బాబు సైతం ఏం చేయాలో తెలియక అప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కత్రినాపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా ? అని చర్చలు కూడా జరిపారు. కత్రినా డిమాండ్లతో సినిమా షూటింగ్‌ను ఆపేయాలని అనుకున్న సురేష్‌బాబు అగ్ర నిర్మాత అశ్వనీదత్ సూచనలతో కత్రినా అడిగిన డిమాండ్లను కొంత వరకు తీర్చి షూటింగ్ పూర్తి చేశారు.
ఆ తర్వాత నుంచి హీరోయిన్లతో అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నామని కూడా సురేష్‌బాబు ఓ సందర్భంలో చెప్పారు. అందుకే ఈ సినిమా తర్వాత నుంచి సురేష్‌బాబు తమ బ్యానర్ రేంజ్‌కు తగ్గట్టుగా భారీ బడ్జెట్ సినిమాలు చేసేందుకు రిస్క్ చేయడం లేదు.