సినీ రంగంలో ఎన్టీఆర్ స్టయిలే వేరు. అందరికీ ఆదర్శంగా ఆయన జీవనం ఉండేది. హుందాతనం.. ప్రతి ఒక్కరి విషయంలోనూ.. కలగలుపు వంటివి స్పష్టంగా కనిపించేవి. దీంతో ఆయన అందరిలోనూ కలిసిపో యేవారు. ప్రతి ఒక్కరినీ ఎన్టీఆర్ ఆప్యాయంగా పలకరించేవారు. ముఖ్యంగా తనకు సీనియర్లుగా ఉన్నవా రితో మరింత చనువుగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో చిత్తూరు వి. నాగయ్యతో అన్నగారికి ఉన్న అను బంధం చాలా స్పెషల్.
సీనియర్ మోస్ట్ నాయకుడైన చిత్తూరు వి. నాగయ్య.. అనేక సినిమాల్లో ఎన్టీఆర్‌తోను.. అటు అక్కినేని నాగే శ్వరరావుతోనూ..కలిసి పనిచేశారు. అయితే.. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం వేరు. అనేక చిత్రాల్లో అన్నగా రికి తండ్రి పాత్రల్లో నటించారు నాగయ్య. అంతేకాదు.. ఇరువురి మధ్య ఆప్యాయత కూడా ఉంది. గతంలో నాగయ్య..దర్శకులుగా.. సంగీత దర్శకులుగా బహుముఖ ప్రజ్ఞాశాలి. దీంతో అన్నగారికి ఆయనకు మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది.
అందుకే తర్వాత చిత్రాల్లో.. అన్నగారితో కలిసి ఎక్కువగా నటించింది నాగయ్యే. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య అవ్యాజమైన అనుబంధం నెలకొంది. ఇదే తర్వాత. కాలంలో.. నాగయ్యను ఎన్టీఆర్‌కు తండ్రికాని తండ్రిని చేస్తే.. ఎన్టీఆర్‌ను నాగయ్యకు దత్తపుత్రుడిని చేసింది. నాగయ్యకు ఏదో కారణంతో పిల్లలు పుట్ట లేదు. దీంతో ఆయనకు ఎన్టీఆర్, ఏఎన్నార్ బాగా చేరువయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్.. నాగయ్యను `నాన్నగారు` అనే పిలిచేవారు.
ఇది కేవలం పిలుపునకు మాత్రమే పరిమితం కాలేదు. ఎంతో ఆప్యాయతను కూడా చూపించేవారు. ఎన్టీ ఆర్ కుటుంబంలో ఏం జరిగినా..ముందు తెలిసేది.. నాగయ్యకే. అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. నాగయ్యే ముఖ్య అతిథి. ఇంట్లో పెద్దాయన కూడా. అలా పాలు-తేనె మాదిరిగా.. కలిసిపోయారు. తుది దశలో నాగయ్య ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అన్నగారు ఆదుకుని.. ఆయనను బాగా చూసుకున్నారని అంటారు సినీ రంగానికి చెందిన ప్రముఖులు.