Moviesయస్..అది నిజమే..నాగచైతన్య బుద్ధి అలాంటిదే..బిగ్ బాంబ్ పేల్చిన సమంత..!!

యస్..అది నిజమే..నాగచైతన్య బుద్ధి అలాంటిదే..బిగ్ బాంబ్ పేల్చిన సమంత..!!

ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న సమంత ..తన లోని కోపాన్ని ఒక్కసారిగా బయటకు కక్కేసింది. తప్పు ఎవరిదో తెలియదు కానీ..తప్పంతా నాగ చైతన్య దే అంటూ తన మీద తోసేసింది. మనకు తెలిసిందే సమంత నాగచైతన్య ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్న వారు పట్టు మంటే పది సంవత్సరాలు కాపురం చేసుకోకుండానే విడాకుల బాట పట్టారు. దానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నా..అస్సలైన రీజన్ వేరేది అని అందరికి తెలిసిందే..ఆ విషయాని వాళ్ళు చెప్పారు..ఎందుకంటే..పెద్దింటి పిల్లలు పరువు పోతుంది అని భయం.

అయితే, సమంత సినీ బ్యాక్ గ్రౌండ్ చాలా తక్కువ..పెద్దగా చెప్పుకోతగ్గ మ్యాటర్ ఏం లేదు. కష్టపడి హీరోయిన్ అయ్యిందని మాటే కానీ..బ్యాక్ గ్రౌండ్ లో ఇది నా ఫ్యామిలీ అని చెప్పుకోడానికి ఏం లేదు. దీంతో విడాకుల మ్యాటర్ లో సమంత పై ఎక్కువ ట్రోలింగ్ జరిగింది. బూతులు తిట్టారు, రంకు అంటగట్టారు..గొడ్రాలు అనే ముద్ర వేశారు ..అవన్ని భరించిన సమంత..ఒక్కసారిగా బర్స్ట్ అయ్యిపోయింది. కాఫీ విత్ కరణ్ షోలో సంచలన విషయాలను బయటపెట్టింది.

మొదట ఈ విషయం గురించి కరణ్ నే ప్రశ్నించగా ..సమంత ఒక్కోకటిగా బయటపెడుతూ వచ్చింది. “అస్సలు సమంత చైతన్య ని భర్త అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. మాజీ భర్త అనండి అంటు కరణ్ కి మొహం మీదనే చెప్పేసింది. అంతేనా..”నేను పడిన బాధలు అంత ఈజీగా మర్చిపోయేవి కావు. మా విడాకులు ఏం సామరస్యంగా జరగలేదు..అంటూ గొడవలతో జరిగిన విషయానికి చెప్పకనే చెప్పేసింది.

అంతేనా, మా ఇద్దరిని ఒక్కే రూమ్ లో పెడితే పదునైన వస్తువులు కూడా పెట్టాలి..అంటూ పరోక్షంగా చైతన్య ని చంపే అంత కోపం ఉందని చెప్పేసింది. ఇక ఊ అంటావా మావ సాంగ్ లో నటించింది కూడా అందుకే..అంటూ బిగ్ బాంబ్ పేల్చింది . “కొందరి అబ్బాయిలల్లో పురుష అహంకారం..ఎక్కువ గా ఉంటుంది..అది అణిచి వేయాలనే ఆ పాట చేశాను. ఆ పాటలో ఉన్నది పచ్చి నిజం. చాలా మంది మగబుద్ధి అంతే..కొంత మంది పురుషుల నైజాన్ని చెప్పడానికి మంచి అవకాశం రావడం, అందులోను తన లాంటి సెలబ్రెటీ చెపితే ప్రభావం ఉంటుంది అందుకే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నాను..” అంటూ తన విడాకులకు సంబంధించిన విషయాలను చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news