స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్….గంగోత్రి నుంచి మనవాడి పయనం ఎవ్వరికైనా ఆదర్శనీయమే. అల్లు అర్జున్ కష్టం ఆ రేంజ్లో ఉంటుంది. అలాగే ట్రెండ్‌ని ఫాలో అవడంలో కూడా అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా. అప్పట్లో బాలీవుడ్ హీరోలందరూ కూడా సిక్స్ ప్యాక్‌లు చేస్తూ సౌత్ హీరోలను, తెలుగు హీరోలను కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోలకంటే కూడా ది బెస్ట్ సిక్స్ ప్యాక్‌ని చూపించాడు అల్లు అర్జున్.
ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. స్టైల్ ఐకాన్స్ అంటే సాధారణంగా సౌత్ ఇండియన్ ప్రేక్షకులు, సినిమావాళ్ళు కూడా బాలీవుడ్ వాళ్ళవైపు చూస్తారు. డ్రెస్సింగ్ నుంచి స్టైలింగ్ వరకూ బాలీవుడ్ హీరోలను కొట్టే హీరో సౌత్‌లో లేడని చాలా మంది గట్టి నమ్మకం. అభిప్రాయం. అందుకే ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్. త్వరలోనే ‘డిజె’గా మన ముందుకు రాబోతున్న బన్నీ…అందులో స్టైల్‌కి కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నాడట. ఇండియన్ స్క్రీన్ పైన ఇప్పటి వరకూ ఏ హీరో కూడా కనిపించినంత కొత్తగా బన్నీ కనిపిస్తాడట. అసలే డిజె క్యారెక్టర్…..ఆ పైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ స్టైల్‌కి ఫిదా అవ్వని వాళ్ళు ఉంటారా?